చిరంజీవి బయోపిక్: నాగబాబు ఏం చెప్పాడంటే?

  • Published By: vamsi ,Published On : March 9, 2019 / 11:58 AM IST
చిరంజీవి బయోపిక్: నాగబాబు ఏం చెప్పాడంటే?

తెలుగుతెరపై ఇప్పుడు బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తుంది. మహానటి సావిత్రి బయోపిక్ విడుదల అయ్యాక ఈ బయోపిక్‌లకు ఆదరణ ఇంకా పెరిగింది. ఈ క్రమంలో ఎన్టీఆర్  బయోపిక్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చిరంజీవి బయోపిక్ మీద కూడా అటువంటి ఆసక్తకర చర్చే నడుస్తుంది.
Read Also : అమ్మ పోయాక మోడీనే నాన్నయ్యారు

తాజాగా చిరంజీవి బయోపిక్ విషయమై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. మెగాస్టార్ చిరంజీవి బ‌యోపిక్ గురించి కూడా ఆయ‌న అభిమానులు ఎదురుచూస్తున్నారని, చిరంజీవి బయోపిక్ ఎప్పుడు ఆశించవచ్చు అంటూ అడిగిన ప్రశ్నకు సమాధానంగా అటువంటి ఆలోచన వద్దని, చిరంజీవి బయోపిక్ తీసే అవకాశం లేదంటూ ఆయన స్పష్టం చేశారు. 
Read Also : లోకేష్ ఎందుకు మాట్లాడటం లేదు.. ఆయన డిపార్ట్ మెంటే కదా : బుగ్గన

బ‌యోపిక్ అంటే బీభత్సమైన డ్రామా ఉండాలి. ఎమోషన్‌ ఉండాలి. అయితే అన్నయ్య జీవితంలో అటువంటివి కనిపించవు. అందుకే అన్న‌య్య బ‌యోపిక్ వ‌స్తే బాగుంటుంద‌నే ఆలోచ‌న నాకు అస‌లు లేదు. చ‌ర‌ణ్‌కు కూడా ఉంటుంద‌ని అనుకోను. బ‌యోపిక్ అంటే అప్స్ అండ్ డౌన్స్ ఉండాలి. అన్న‌య్య జీవితంలో అలాంటివి చాలా త‌క్కువ‌. సావిత్రి, సిల్క్ స్మిత క‌థ‌లు అంటే డ్రామిటిక్‌గా అందరినీ ఆకట్టుకునే డ్రామాతో ఉంటాయి. అందుకే ఆ ఆలోచ‌న చేయ‌కూడ‌ద‌ు అన్నారు. 
Read Also : పిల్లులను పట్టుకుంటే.. లక్ష రూపాయలిస్తాం