Nagababu : సినిమా అనేది జస్ట్ బిజినెస్ మాత్రమే.. వాళ్లకు కౌంటర్ ఇచ్చిన నాగబాబు..

కొంతమంది సినిమాల వల్ల జనాలు చెడిపోతున్నారు, జనాలు తప్పుదోవ పడుతున్నారు అంటూ వచ్చిన ప్రతి సినిమాలో ఏదో ఒక పాయింట్ పట్టుకొని విమర్శిస్తున్నారు. తాజాగా అలాంటి వాళ్లకి నాగబాబు కౌంటర్ ఇస్తూ తన ట్విట్టర్లో ట్వీట్లు చేశాడు....................

Nagababu : సినిమా అనేది జస్ట్ బిజినెస్ మాత్రమే.. వాళ్లకు కౌంటర్ ఇచ్చిన నాగబాబు..

some People says movies misled the socity and Nagababu countered to that people

Nagababu :  నటుడు నాగబాబు ప్రస్తుతం ఎపుడో అడపాదడపా సినిమాల్లో నటిస్తూ పూర్తిగా జనసేనకు సమయం వెచ్చిస్తున్నారు. ఆ పార్టీ పనుల్లో ఎక్కువగా యాక్టీవ్ గా ఉంటున్నారు. ఇక ఆ పార్టీకి సంబంధించి కానీ, సమాజంలోని కొన్ని సమస్యల గురించి కానీ, సినిమాల గురించి.. ఇలా పలు అంశాలపై అప్పుడప్పుడు తన సోషల్ మీడియాలో స్పందిస్తూ ఉంటారు. తాజాగా సినిమాలకి, సమాజానికి సంబంధించిన ఓ అంశంపై స్పందిస్తూ ట్వీట్స్ చేశారు.

సినిమాని ఎంత ప్రేమించినా అది ఒక బిజినెస్ అని ఆ రంగంలో ఉన్న వాళ్ళే చెప్తూ ఉంటారు. కానీ అభిమానులు, కొంతమంది సినిమాలని తమ పర్సనల్ గా తీసుకొని సినిమాల్లో వచ్చేవాడిని అనుకరించడం, సినిమాల్లో చేసేవి చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. మంచి పనులు చేస్తే పర్లేదు కానీ చెడ్డ పనులు కూడా చేసి సినిమాలని చూసి మోటివేట్ అయ్యాం అంటారు. దీంతో కొంతమంది సినిమాల వల్ల జనాలు చెడిపోతున్నారు, జనాలు తప్పుదోవ పడుతున్నారు అంటూ వచ్చిన ప్రతి సినిమాలో ఏదో ఒక పాయింట్ పట్టుకొని విమర్శిస్తున్నారు. తాజాగా అలాంటి వాళ్లకి నాగబాబు కౌంటర్ ఇస్తూ తన ట్విట్టర్లో ట్వీట్లు చేశాడు.

Music Directors : ఇండస్ట్రీలో కొత్త మ్యూజిక్ సరుకు.. దేవిశ్రీ, తమన్ కి పోటీగా ఎదుగుతున్న మ్యూజిక్ డైరెక్టర్స్..

నాగబాబు తన ట్వీట్స్ లో.. సినిమాల్లో చూపించే వయోలెన్స్ వల్ల జనాలు చెడిపోతారు అనుకుంటే, మరి సినిమాల్లో చూపించే మంచి వల్ల జనాలు బాగుపడాలి కదా. ఒక ఫిలిం మేకర్ గా చెప్తున్నాను సినిమాలు ఎంటర్టైన్మెంట్ కోసమే. జనాన్ని బాగు చెయ్యటం కోసమో, చెడగొట్టాడానికోసమో తీసేంత గొప్పవాళ్ళు లేరిక్కడ. ఇది ఒక బిజినెస్ మాత్రమే. సినిమాల వల్ల జనాలు చెడిపోతున్నారు అని ఏడ్చే కుహనా మేధావులకు ఇది ఆన్సర్. సినిమాల్లో ఏదన్నా ఓవర్ గా ఉంటే చూసుకోవడానికి సెన్సార్ ఉంది. కుహనా మేధావులు ఏడవకండి అంటూ ట్వీట్స్ చేశారు. దీంతో నాగబాబు చేసిన ట్వీట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.