మీసం మెలెయ్యడం కంటే ముఖానికి మాస్క్ ధరించడమే వీరత్వం..

10TV Telugu News

‘మీసం మెలెయ్యటం వీరత్వమే.. కానీ అది ఒకప్పుడు.. కానీ ఇప్పుడు ముఖానికి మాస్క్‌ ధరించడం వీరుడి లక్షణం’.. అంటూ మరో వీడియోను కూడా మెగాస్టార్ చిరంజీవి షేర్ చేశారు. ఈ వీడియోలో చిరంజీవితో పాటు యంగ్ హీరో కార్తికేయ నటించాడు.

‘కరోనా కట్టడికి మాస్క్ తప్పనిసరిగా ధరించండి.. వీలైనన్నిసార్లు సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోండి.. సాంఘిక దూరాన్ని పాటించండి.. మిమ్మల్ని మీరు కాపాడుకోండి.. అలాగే మీ కుటుంబాన్ని ఈ దేశాన్ని కూడా కాపాడండి’.. అంటూ చిరు పిలుపునిచ్చారు. అలాగే ఈ ఆలోచన పంచుకోగానే ముందుకొచ్చిన కార్తికేయకు, ఈషాకు, ఇతర సిబ్బందికి చిరంజీవి ధన్యవాదాలు తెలియజేశారు.

Kartikeya

ఈ వీడియోను, మెగాస్టార్‌తో నటించిన అనుభవాన్ని కార్తికేయ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ‘కరోనా భయం, షూటింగ్‌ని మిస్ అవడం, తర్వాత ఎలా ఉంటుందనే భయం.. ఈ ఒక్క వీడియోతో అన్నీ తీరిపోయాయి. ఓ మంచి పని కోసం మెగాస్టార్‌ గారితో కలిసి నేను ఓ వీడియో చేశాను. నా సినిమాలు పది విడుదలైనా ఈ కిక్ రాదు. మెగాస్టార్ సర్‌తో ఇది నా జీవితకాల జ్ఞాపకం’ అని కార్తికేయ ట్వీట్ చేశాడు.