Chiranjeevi – Sai Kumar : ‘రొటీన్ అయిపోయావ్ రా సాయి’..

చిరు, సాయి కుమార్ సినీ కెరీర్‌ని ఉద్దేశించి చెప్పిన మాటలు ఫిలింసర్కిల్లో వైరల్‌గా మారాయి..

Chiranjeevi – Sai Kumar : ‘రొటీన్ అయిపోయావ్ రా సాయి’..

Chiranjeevi Sai Kumar

Chiranjeevi – Sai Kumar: మెగాస్టార్ చిరంజీవిని డైలాగ్ కింగ్ సాయి కుమార్ ఆప్యాయంగా అన్నయ్య అని పిలుస్తారనే సంగతి తెలిసిందే. సాయి కుమార్, ఆయన కొడుకు ఆది సినిమాల ఫంక్షన్లకి, ఫ్యామిలీ ఫంక్షన్లకి చిరు అటెండ్ అవుతుంటారు. రీసెంట్‌గా జరిగిన సాయి కుమార్ షష్టిపూర్తి కార్యక్రమానికి కూడా చిరంజీవి హాజరై సాయి కుమార్ దంపతులను బ్లెస్ చేశారు.

SR Kalyanamandapam : కిరణ్ అబ్బవరం కుమ్మేశాడుగా..!

అయితే ఈమధ్య చిరంజీవిని సాయి కుమార్ కలిశారు.. ఆ సందర్భంలో చిరు, సాయి కుమార్ సినీ కెరీర్‌ని ఉద్దేశించి చెప్పిన మాటలు ఫిలింసర్కిల్లో వైరల్‌గా మారాయి. సాయి కుమార్ హీరోగా మంచి ఫామ్‌లో ఉన్నప్పుడే తెలుగుతో పాటు కన్నడలోనూ కంటిన్యూస్‌గా సినిమాలు చేస్తూ వచ్చారు. హీరోగా గ్యాప్ వచ్చిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారి సత్తా చాటారు. డబ్బింగ్ పరంగానూ, టీవీ షోలకు హోస్ట్‌గానూ ఆయనెప్పుడూ బిజీగానే ఉంటుంటారు.

Sr Kalyanamandapam

 

‘ప్రస్థానం’లో సీరియస్, ‘భలే మంచి రోజు’ లో కామెడీ రోల్స్ తర్వాత ఆ రేంజ్ క్యారెక్టర్ పడలేదు. ఈమధ్య అన్నీ ఒకే తరహా పాత్రలు చేస్తున్నారు. దీంతో చిరు, ‘రొటీన్ అయిపోయావ్ రా సాయి.. వేసిన వేషాలే వేస్తున్నావ్.. ఏదైనా కొత్తగా చేస్తే బాగుంటుంది రా.. నువ్వు కొత్తగా ట్రై చెయ్’.. అని చెప్పారట.చిరు సలహా విన్న సాయి కుమార్.. ‘తప్పకుండా కొత్త కథలు, డిఫరెంట్ క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకుంటా అన్నయ్యా’ అని చెప్పారట.

‘నా పంచెలో రామాయణమేనా’.. టీజర్ అదిరిందిగా..

చాలా రోజుల తర్వాత ‘ఎస్.ఆర్. కళ్యాణ మండపం’ సినిమాలో హీరో ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్న సాయి కుమార్.. టీజర్, ట్రైలర్‌లో చితక్కొట్టేశారు. ‘నా పంచెలో రామాయణమేనా’ అంటూ తన స్టైల్లో ఆయన చెప్పిన డైలాగ్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సాయి కుమార్ క్యారెక్టర్ కోసమైనా సినిమా చూడాలి అంటున్నారు ఆడియన్స్.. ఈ సినిమాతో సాయి కుమార్ ప్రేక్షకులను ఆకట్టుకుని బౌన్స్ బ్యాక్ అవుతానని కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.