డిఫరెంట్ డ్రస్సింగ్ స్టైల్ లో ప్రియాంక‌, దీపికా

  • Published By: veegamteam ,Published On : May 7, 2019 / 07:57 AM IST
డిఫరెంట్ డ్రస్సింగ్ స్టైల్ లో ప్రియాంక‌, దీపికా

అమెరికాలోని న్యూయార్క్ నగరంలో మెట్రోపాలిటన్‌ మ్యూజియం ఆఫ్‌ ఆర్ట్స్ ప్ర‌తి సంవత్సరం MET GALA అనే షో నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ షోలో జ‌రిగే రెడ్ కార్పెట్‌లో పాల్గొనేందుకు మోడ‌ల్స్ వెరైటి డ్రసెస్స్ లో వస్తుంటారు. అయితే ఈ ఇయర్ వేడుక సోమవారం (మే 6, 2019) ప్రారంభమైంది. ఈ వేడుకలో బాలీవుడ్‌ తారలు ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణె వెరైటీ డ్రెస్ ధ‌రించి ఎప్పటిలాగే అదరగొట్టారు. 

గ‌త ఏడాది పొడవాటి గౌన్‌లో మెరిసిన ప్రియాంక ఈ సారి రింగుల జుట్టు, సిల్వర్‌ రంగు గౌనులో ఆ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలివగా.. దీపికా గులాబీ రంగు గౌనులో బార్బీ బొమ్మలా తయారై అందరిని ఆకట్టుకుంది. అయితే MET GALA కార్య‌క్ర‌మం ప్ర‌తి ఏడాది ఏదో ఒక థీమ్‌తో జ‌రుగుతూ ఉంటుంది. ఈ సారి ‘క్యాంప్‌ నోట్స్‌ ఆన్‌ ఫ్యాషన్‌’ అనే థీమ్‌తో కార్య‌క్ర‌మం జ‌రిగింది.

అంతేకాదు ఈ వేడుకలో రిలయన్స్‌ సంస్థల అధినేత ముఖేశ్‌ అంబానీ కుమార్తె ఈషా అంబానీ కూడా ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ ప్రబల్‌ గురుంగ్‌ డిజైన్‌ చేసిన గౌనులో హాజరై సందడి చేశారు.