Srvanthi Chokarapu : మిత్రా శర్మ నాకు 5 లక్షలు ఇస్తానంది

స్రవంతి మాట్లాడుతూ.. ''బిగ్‌బాస్‌ హౌస్‌లో నా లైఫ్‌ గురించి చెప్పినప్పుడు మిత్రా శర్మ ముందుకు వచ్చి 5 లక్షలు ఇస్తానంది. తాను నాతో బాధపడొద్దు అని దగ్గరికి తీసుకుంది. నా ఇంట్లో.......

Srvanthi Chokarapu : మిత్రా శర్మ నాకు 5 లక్షలు ఇస్తానంది

Srvanathi

Srvanthi Chokarapu :  బిగ్‌బాస్‌ ఆరోవారంలో ముమైత్, స్రవంతి ఇద్దరూ ఎలిమినేట్ అయ్యారు. ఇక ఎలిమినేట్ అయిన వారితో బిగ్‌బాస్‌ బజ్ అని ఇంటర్వ్యూ కూడా తీసుకుంటారు. ఈ ఇంటర్వ్యూలో బిగ్‌బాస్‌ తో ఉన్న తమ అనుభవాలు, హౌస్ లోని కంటెస్టెంట్స్ గురించి షేర్ చేసుకుంటారు. గత వారం బయటకి వచ్చిన వారిలో స్రవంతి చొక్కారపు ఇటీవలే యాంకర్ గా మెల్లి మెల్లిగా పాపులర్ అవుతుంది. ఎన్నో ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నా ఇటీవలే తనకి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు బిగ్‌బాస్‌ తో మరింత ఫేమ్ వచ్చింది.

అయితే స్రవంతికి ఆల్రెడీ పెళ్లి అయిపొయింది. తనకి ఒక బాబు కూడా ఉన్నాడు. ఆమెకి ఫైనాన్సియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని బిగ్‌బాస్‌ లో కొన్ని సందర్భాల్లో తెలిపింది. తాజాగా స్రవంతి బిగ్‌బాస్‌ బజ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికర విషయం తెలిపింది. స్రవంతి మాట్లాడుతూ.. ”బిగ్‌బాస్‌ హౌస్‌లో నా లైఫ్‌ గురించి చెప్పినప్పుడు మిత్రా శర్మ ముందుకు వచ్చి 5 లక్షలు ఇస్తానంది. తాను నాతో బాధపడొద్దు అని దగ్గరికి తీసుకుంది. నా ఇంట్లో పనిచేసే అమ్మాయికి 10 లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేశాను. అలాంటిది మీరు నన్ను దగ్గరుండి చూసుకున్నారు, తినిపించారు, నా ఆరోగ్యం బాగోలేనప్పుడు అమ్మలా, అక్కలా చూసుకున్నారు. మీకు నేను 5 లక్షలు ఇవ్వలేనా అని నాతో చెప్పింది. నేనెవరో పూర్తిగా తెలియకపోయినా మిత్రా శర్మ నాకోసం అలా మాట్లాడటం నాకు నచ్చింది. అందుకే ఆమెకు హౌస్ నుంచి వచ్చేటప్పుడు ఎక్స్‌ట్రా హగ్‌ ఇచ్చాను. తాను ఇచ్చినా, ఇవ్వకపోయినా ఆ మాట అన్నందుకు చాలా ఆనందంగా ఉంది” అని తెలిపింది.

Naga Chaitanya : నాగచైతన్య కార్ ఆపి ఫైన్ వేసిన పోలీసులు..

అయితే మిత్రా శర్మ మంచి వ్యాపారవేత్త, మోడల్, నటి, నిర్మాత కూడా. ఆమె సొంతంగా కస్టపడి ఎదిగింది. త్వరలో తానూ నిర్మాతగా ఓ సినిమాని రిలీజ్ చేయబోతుంది. ఇప్పుడు స్రవంతికి 5 లక్షలు ఇస్తాను అనడంతో తన మంచి మనసుని పొగుడుతున్నారు నెటిజన్లు.