Mumait Khan : టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. ముమైత్ ఖాన్ విచారణలో కీలక విషయాలు

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ముమైత్ ఖాన్ విచారణ ముగిసింది. దాదాపు ఏడు గంటలకు పైగా ముమైత్ ఖాన్ ను ఈడీ అధికారులు విచారించారు. బ్యాంకు లావాదేవీలు, మనీల్యాండరింగ్ ఉల్లంఘలనపై ఆరా తీశారు.

10TV Telugu News

Tollywood drugs case : టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ముమైత్ ఖాన్ విచారణ ముగిసింది. దాదాపు ఏడు గంటలకు పైగా ముమైత్ ఖాన్ ను ఈడీ అధికారులు విచారించారు. బ్యాంకు లావాదేవీలు, మనీల్యాండరింగ్ ఉల్లంఘనలపై ఆరా తీశారు. ఆమె బ్యాంకు అకౌంట్లను పరిశీలించారు. ముమైత్ కు ముంబాయిలోని బ్యాంకుల్లో అకౌంట్లున్నట్లు గుర్తించారు. ముంబాయిలో రెండు బ్యాంకు ఖాతాలున్నట్లు గుర్తించారు.

గతంలో ఆమె జరిపిన లావాదేవీల లెక్కలపై ఆరా తీశారు. 2017 ఎక్సైజ్ శాఖ నివేదిక ఆధారంగా ఈడీ విచారించింది. ఎఫ్ లాంజ్ క్లబ్ పార్టీల్లో జరిగిన డ్రగ్స్ పరఫరాపై ముమైత్ ను ఈడీ అధికారులు విచారించారు. ఎఫ్ లాంజ్ క్లబ్ జీఎంకు ముమైత్ కు మధ్య బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ పై ఆరా తీశారు. ఎఫ్ లాంజ్ క్లబ్ లో జరిగిన ఈవెంట్లు..నగదు లావాదేవీలపై అధికారులు ఆమెను ప్రశ్నించారు. ఎప్పుడు విచారణకు పిలిచినా హాజరు కావాలని ఈడీ ఆదేశించింది.

Tollywood Drugs Case : టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. పూరీ జగన్నాథ్ విచారణలో కీలక విషయాలు

డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్, జిషాన్ లతో ముమైత్ కు నేరుగా సంబంధాలున్నట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. ఎఫ్ లాంజ్ క్లబ్ లో జరిగిన పార్టీలో ముమైత్ కీ రోల్ ప్లే చేసినట్లు తేల్చారు. ఎఫ్ లాంజ్ క్లబ్ కు డ్రగ్స్ ఎవరు తీసుకొచ్చారన్న కోణంలో ఆమెను ప్రశ్నించారు.

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ముమైత్ ఖాన్ ను నాలుగేళ్ల క్రితం ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రశ్నించారు. అప్పట్లో 10 గంటలపాటు విచారించారు. మళ్లీ ఇవాళ ఈడీ అధికారులు ముమైత్ ఖాన్ ను విచారించారు. టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో కలిసి ముమైత్ ఖాన్ ఆరు సినిమాలు చేసింది. ఇప్పటికే మనీలాండరింగ్ కేసులో పూరీ జగన్నాథ్ ను ఈడీ అధికారులు ప్రశ్నించారు.

10TV Telugu News