RRR : చరిత్ర సృష్టించిన నాటు నాటు.. ఆస్కార్ నామినేషన్ దక్కించుకున్న ఫస్ట్ ఇండియన్ సాంగ్..

ఇండియా ప్రేక్షకులంతా RRR ఎన్ని విభాగాల్లో నామినేట్ అవుతుందా అని ఎంతగానో ఎదురు చూశారు. అందరూ అనుకున్నట్టే ప్రపంచాన్ని ఊపేసిన నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో...............

RRR : చరిత్ర సృష్టించిన నాటు నాటు.. ఆస్కార్ నామినేషన్ దక్కించుకున్న ఫస్ట్ ఇండియన్ సాంగ్..

Naatu Naatu song Nominated at 95th Oscars in Best Original song Category

RRR :  సినిమా వాళ్లకి ప్రపంచంలోనే అత్యున్నతమైన అవార్డు ఆస్కార్. ఈ అవార్డు కోసం ప్రపంచంలోని సినిమా వాళ్లంతా కలలు కంటారు. ఈ అవార్డు నామినేషన్స్ లో నిలిచినా చాలు అనుకుంటారు. అయితే ఈ సారి ఆస్కార్ నామినేషన్స్ ఇండియా వాళ్లకి మరింత ఆసక్తికరంగా మారాయి. ప్రపంచం మొత్తం మెచ్చిన మన తెలుగు సినిమా, రాజమౌళి తెరకెక్కించిన సినిమా RRR ఆస్కార్ నామినేషన్స్ లో నిలుస్తుందా లేదా అని గత కొన్ని రోజులుగా అంతా ఉత్కంఠగా ఎదురుచూశారు.

95వ ఆస్కార్ నామినేషన్స్ ని అమెరికన్ టైం ప్రకారం ఉదయం 8:30 amకి అంటే మన ఇండియన్ టైం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రసారం అయింది. ఈ 95వ ఆస్కార్ నామినేషన్ల లైవ్ కార్యక్రమాన్ని Oscar.com, Oscars.org, అకాడమీ యొక్క YouTube, Facebook, Instagram, Twitterలో ప్రత్యక్ష ప్రసారం ఇచ్చారు. కాలిఫోర్నియాలోని బ్లేవ‌రిహిల్స్ వేదిక‌గా ఈ ఆస్కార్ నామినేషన్స్ లిస్ట్ ప్రకటించారు.

ఇండియా ప్రేక్షకులంతా RRR ఎన్ని విభాగాల్లో నామినేట్ అవుతుందా అని ఎంతగానో ఎదురు చూశారు. అందరూ అనుకున్నట్టే ప్రపంచాన్ని ఊపేసిన నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేషన్స్ దక్కించుకుంది. మరి కొన్ని విభాగాల్లో ఆశించినా RRR నిలవలేదు. అయితే ఈ ఒక్క విభాగంలో నామినేషన్ దక్కించుకోవడంతో అభిమానులు, భారత ప్రేక్షకులు, చిత్రయూనిట్ అంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న ఈ పాటు ఇప్పుడు ఆస్కార్ నామినేషన్స్ లో నిలవడంతో అందరూ కీరవాణి, రాజమౌళిలని అభినందిస్తున్నారు. ఈ నామినేషన్స్ తోనే ఆస్కార్ నామినేట్ అయిన ఫస్ట్ ఇండియన్ సాంగ్ గా చరిత్ర సృష్టించింది. ఇంకా ఒక్క అడుగు దూరంలో ఆస్కార్ ఉంది.

Pathaan : రిలీజ్ కి ముందే 50 కోట్ల వసూళ్లు.. ఇక రిలీజయితే.. 100 దేశాల్లో షారుఖ్ కంబ్యాక్ మూవీ విడుదల..

అధికారిక 95వ ఆస్కార్ అవార్డుల వేడుక మార్చి 12 న ఓవేషన్ హాలీవుడ్‌లోని డాల్బీ థియేటర్ లో జరగనున్నాయి. ఆస్కార్ మనకి వస్తుందా రాదా తెలియాలంటే అప్పటిదాకా ఆగాల్సిందే. నాటు నాటు పాటతో పాటు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో applause song from Tell it Like A Woman, Hold my Hand song from Top Gun : Maveric, Lift me up song from Black Panther : Wakanda forecer, This is a Life song From Everything Everywher all at Once పాటలు నామినేషన్స్ నిలిచాయి.

అలాగే నాటు నాటు పాటతో పాటు భారత దేశం నుంచి డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ది ఎలిఫెంట్ విస్పర్స్, డాక్యుమెంటరీ ఫ్యూచర్ ఫిల్మ్ విభాగంలో అల్ ది బ్రీత్స్ సినిమాలు కూడా నామినేషన్స్ లో నిలిచాయి.