Naga Chaitanya : సమంత దారి సమంతది.. నా దారి నాది..

తాజాగా చైతూ లాల్ సింగ్ చడ్డా ప్రమోషన్స్ కోసం ఓ ఇంటర్వ్యూ ఇవ్వగా అందులో కూడా సమంత గురించి అడిగారు. దీనికి చైతూ కొంచెం సీరియస్ గానే స్పందించాడు. చైతూ మాట్లాడుతూ.........

Naga Chaitanya : సమంత దారి సమంతది.. నా దారి నాది..

Samantha

Naga Chaitanya :  సమంతతో విడాకుల తర్వాత పూర్తిగా కెరీర్ మీదే ఫోకస్ పెట్టాడు చై. వరుస సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తో కలిసి లాల్ సింగ్ చడ్డాలో నటించాడు. ఈ సినిమా ఆగస్టు 11న రిలీజ్ కానుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు చైతు. తెలుగులో కూడా అమీర్ ఖాన్, చైతు కలిసి భారీగా ప్రమోషన్స్ చేస్తున్నారు ఈ సినిమాని. ఇక చైతన్య, సమంత ఎవరు ఇంటర్వ్యూలు ఇచ్చినా ఒకరి గురించి ఒకర్ని అడుగుతూనే ఉంటుంది మీడియా.

తాజాగా చైతూ లాల్ సింగ్ చడ్డా ప్రమోషన్స్ కోసం ఓ ఇంటర్వ్యూ ఇవ్వగా అందులో కూడా సమంత గురించి అడిగారు. దీనికి చైతూ కొంచెం సీరియస్ గానే స్పందించాడు. చైతూ మాట్లాడుతూ.. ”నా వ్యక్తిగత జీవితం గురించి అందరూ మాట్లాడటం నాకు అసహనాన్ని కలిగిస్తోంది. ప్రతి ఒక్కరికీ పర్సనల్‌ లైఫ్‌ ఉంటుంది. సమంతతో విడాకులపై అధికారికంగానే ప్రకటన చేశాం. దానికి కారణమేంటో ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ప్రస్తుతం ఎవరి జీవితాన్ని వారు జీవిస్తున్నాం. సమంత దారి సమంతదే, నా దారి నాదే. ఇంతకంటే ఇంకా ఏమి చెప్పలేను” అని సీరియస్ గా చెప్పారు.

Chandan Kumar : సీరియల్ హీరో చెంప చెళ్లుమనిపించిన అసిస్టెంట్ డైరెక్టర్

ఇక తనపై వస్తున్న రూమర్స్‌ని నేను అస్సలు పట్టించుకోను అని, వాటి గురించి ఆలోచించే టైం నాకు లేదని తెలిపాడు. ఇక సమంతతో భవిష్యత్తులో కలిసి నటిస్తారా అని అడిగితే.. అది జరగదు, ఒకవేళ జరిగితే అది అద్భుతమే అని సమాధానమిచ్చాడు చైతన్య.