ఫస్ట్ టైం..పోలీస్ ఆఫీసర్ గా చైతూ

  • Published By: veegamteam ,Published On : April 26, 2019 / 08:24 AM IST
ఫస్ట్ టైం..పోలీస్ ఆఫీసర్ గా చైతూ

తాజాగా నాగ చైతన్య మజిలీ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన వెంకటేష్ తో కలిసి వెంకీ మామ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రం తరువాత సోలో హీరోగా RX 100 ఫేమ్ అజయ్ భూపతి తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ చిత్రానికి మహాసముద్రం అనే టైటిల్ ప్రచారం లో వుంది. ఇక ఈ చిత్రంలో చైతూ పోలీస్ ఆఫీసర్ గా నటించనున్నాడని టాక్. ఒకవేళ ఈ న్యూస్ నిజమైతే చైతు ఇలాంటి రోల్ చేయడం ఇదే మొదటిసారి అవుతుంది. 

మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ స్క్రిప్ట్ కి తుది మెరుగులు దిద్దుతున్నాడు అజయ్ భూపతి. త్వరలోనే ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి. ఈ సినిమా వైజాగ్ బ్యాక్ డ్రాప్ కాబట్టి సముద్రం అని పెట్టారటా. మహా ప్రేమ కోసం పోరాడుతూనే సముద్రాన్ని దోచుకుంటున్న మాఫియాను అంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న హీరో కథే ఈ సినిమా.