Krishna Vrinda Vihari: కృష్ణగా రాబోతున్న శౌర్య.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
హిట్టు ఫట్టుతో సంబంధం లేకుండా తాను చేయాల్సిన పని చేస్తుకుంటూ వెళ్తున్న యువహీరో నాగ శౌర్య. నాగశౌర్య నటించిన సినిమాలు ఈ మధ్య కాలంలో ఆశించిన స్థాయిలో విజయం దక్కలేదు. అయితే.. శౌర్య మాత్రం వరుస సినిమాలతో లక్ పరీక్షించుకునేందుకు వస్తున్నాడు.

Krishna Vrinda Vihari: హిట్టు ఫట్టుతో సంబంధం లేకుండా తాను చేయాల్సిన పని చేస్తుకుంటూ వెళ్తున్న యువహీరో నాగ శౌర్య. నాగశౌర్య నటించిన సినిమాలు ఈ మధ్య కాలంలో ఆశించిన స్థాయిలో విజయం దక్కలేదు. అయితే.. శౌర్య మాత్రం వరుస సినిమాలతో లక్ పరీక్షించుకునేందుకు వస్తున్నాడు. రకరకాల జానర్లలో ట్రై చేస్తున్న యంగ్ హీరో నాగశౌర్య నటించిన తాజా చిత్రం ‘కృష్ణ వ్రిందా విహారి’. అనీష్ ఆర్. కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో ప్రముఖ సింగర్ షిర్లీ సేథియా హీరోయిన్‌గా పరిచయం కానుంది.
Krishna Vrinda Vihari: సాంగ్ రిలీజ్.. ఇదో ముద్దుల వర్షంలో రొమాంటిక్ వెన్నెల!
ఈ చిత్రాన్ని శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా ముల్పూరి నిర్మించారు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా.. అనివార్య కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకిటించారు మేకర్స్. మే 20వ తేదీన కృష్ణగా నాగశౌర్య రాబోతున్నట్లు మేకర్స్ రిలీజ్ డేట్ ప్రకటించారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ సినిమా కావడంతో నాగశౌర్య చాలా ఆశలే పెట్టుకున్నాడు ఈ సినిమాపై.
Naga Shaurya : వెంకటేష్ కంటే బాగా చూసుకుంటా.. ‘కృష్ణ వ్రింద విహారి’ టీజర్ రిలీజ్..
ముందుగా ఏప్రిల్ 22న ఈ సినిమాను రిలీజ్ చేయాలని భావించగా.. వాయిదా పడి మే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ రాగా.. సీనియర్ హీరోయిన్ రాధికా శరత్ కుమార్ ఓ కీలక పాత్ర పోషించడం.. నాగశౌర్య బ్రహ్మణ యువకుడిగా కనిపించనుండడంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఈ సినిమాతో నాగ శౌర్య మళ్ళీ తన కెరీర్ లో ఒక క్లీన్ హిట్ అందుకుంటాడేమో చూడాలి.
Coming to you as Krishna with lots of love & laugh. May 20th – Get Set for Summer treat people?#KrishnaVrindaVihari on May 20th? #KVV @ShirleySetia #AneeshKrishna #SaiSriram @realradikaa @ira_creations @mahathi_sagar @saregamasouth #KrishnaVrindaVihariOnMay20 pic.twitter.com/z7CGOV7P0G
— Naga Shaurya (@IamNagashaurya) April 23, 2022