బన్నీకి అమ్మగా నగ్మా?

బన్నీకి తల్లిగా నగ్మ..

  • Published By: sekhar ,Published On : February 18, 2019 / 10:22 AM IST
బన్నీకి అమ్మగా నగ్మా?

బన్నీకి తల్లిగా నగ్మ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, నా పేరు సూర్య తర్వాత చాలా గ్యాప్ తీసుకుని, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తన తర్వాత సినిమాని చెయ్యబోతున్నాడు. గత కొంత కాలంగా త్రివిక్రమ్ వరసగా సినిమాలు చేస్తున్న హారిక హాసిని క్రియేషన్స్ ఎస్.రాధాకృష్ణ (చినబాబు) తో కలిసి, గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మించబోతున్నాడు. అల్లు అర్జున్‌కిది 19వ సినిమా. రీసెంట్‌గా త్రివిక్రమ్ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసాడట. ప్రస్తుతం ఆర్టిస్టులు, టెక్నీషియన్ల సెలక్షన్ జరుగుతుంది. బన్నీ కొత్త సినిమాకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అల్లు అర్జున్, త్రివిక్రమ్‌ల సినిమాలో.. ఒకప్పటి పాపులర్ హీరోయిన్, ప్రస్తుతం రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్న నగ్మా, బన్నీ తల్లిగా నటించనుందని వార్తలొస్తున్నాయి. త్రివిక్రమ్, నగ్మాని కలిసి కథ చెప్పినట్టు, ఆమె చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. బన్నీ పక్కన పూజాహెగ్డే హీరోయిన్‌గా నటించబోతుందట. మార్చి చివరి వారం, లేదా, ఎప్రిల్ రెండో వారం నుండి షూటింగ్ స్టార్ట్ కానుందని తెలుస్తుంది.