బాలయ్య, బి.గోపాల్.. ఆరోసారి!

నందమూరి బాలకృష్ణ, బి.గోపాల్ కలయికలో కొత్త చిత్రం..

  • Published By: sekhar ,Published On : March 10, 2020 / 06:08 AM IST
బాలయ్య, బి.గోపాల్.. ఆరోసారి!

నందమూరి బాలకృష్ణ, బి.గోపాల్ కలయికలో కొత్త చిత్రం..

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లు ఆసక్తికరంగా ఉంటాయి. ఒకసారి కలిసి పనిచేసిన హీరో, దర్శకుడు, నిర్మాతల కలయికలో మరో సినిమా వస్తుంది అంటే అంచనాలు సహజం.. ఇక ఆ కాంబో సక్సెస్ అయితే అంచనాలు ఆకాశాన్నంటుతాయి. నటసింహ నందమూరి బాలకృష్ణ పలువురు దర్శకులు, నిర్మాతలతో రిపీట్ సూపర్ హిట్‌లు కొట్టారు.

కోడి రామకృష్ణ, భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ ఎస్.గోపాల్ రెడ్డి, బాలయ్య, బి.గోపాల్, బాలయ్య, బోయపాటి శ్రీను.. ఇవన్నీ క్రేజీ కాంబినేషన్స్. ‘సింహా’, ‘లెజెండ్’ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత బాలయ్య, బోయపాటి కాంబోలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ చిత్రం ఇటీవలే షూటింగ్ ప్రారంభమైంది. ఇది బాలయ్య 106వ సినిమా.. తన తర్వాతి సినిమాను సీనియర్ డైరెక్టర్ బి.గోపాల్‌తో చేయనున్నాడని సమాచారం.

వీళ్ల కలయికలో ‘లారీ డ్రైవర్’, ‘రౌడీ ఇన్‌స్పెక్టర్’, సమరసింహా రెడ్డి’, ‘నరసింహ నాయుడు’, ‘పలనాటి బ్రహ్మనాయుడు’ సినిమాలు వచ్చాయి. చివరగా చేసిన చిత్రం మినహా మిగతావాటిలో సూపర్ డూపర్ హిట్స్, ట్రెండ్ సెట్టర్, ఇండస్ట్రీ హిట్ మూవీస్ ఉన్నాయి. మరోసారి ఈ కాంబో రిపీట్ కానుందని ఫిలింనగర్ సమాచారం. బాలయ్యతో సినిమా చేయాలని ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న బి.గోపాల్ అందుకు తగ్గ కథా కథనాలు రెడీ చేశారని, మూ నెలలో షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది.

See Also | తారక్ ఫ్యామిలీతో హోలీ