Mahesh Babu: మహేష్ సినిమాలో నందమూరి హీరో.. ఇక బాక్సులు బద్దలే!
ఇటీవల టాలీవుడ్లో మల్టీస్టారర్ మూవీలు వరుసగా రిలీజ్ అవుతూ బాక్సాఫీస్‌ను దడదడలాడిస్తున్నాయి. ఇప్పటికే ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీగా ‘ఆర్ఆర్ఆర్’ మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా...

Mahesh Babu: ఇటీవల టాలీవుడ్లో మల్టీస్టారర్ మూవీలు వరుసగా రిలీజ్ అవుతూ బాక్సాఫీస్‌ను దడదడలాడిస్తున్నాయి. ఇప్పటికే ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీగా ‘ఆర్ఆర్ఆర్’ మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ అంచనాలు మధ్య రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లు కలిసి నటించగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కించాడు. ఈ చిత్రానికి యావత్ ప్రపంచంలోని ప్రేక్షకులు నీరాజనాలు పలికారు. ఆ తరువాత వచ్చిన ఆచార్య చిత్రంలోనూ మెగాస్టార్ చిరంజీవి, చరణ్ కలిసి నటించారు. ఇప్పుడు తాజాగా వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్లో ఎఫ్3 మూవీ కూడా మల్టీస్టారర్ చిత్రంగా ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యింది.
Mahesh Babu : రెండొందల కోట్ల క్లబ్లో సర్కారు వారి పాట.. కొనసాగుతున్న మహేష్ మానియా..
అయితే ఈ సినిమాలతో పాటు త్వరలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించబోయే సినిమాలో కూడా మరో హీరో నటించబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా టాక్ వినిపిస్తోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో మహేష్ బాబు సరికొత్త లుక్‌లో కనిపిస్తాడనే టాక్ ఇప్పటికే సినీ వర్గాల్లో వినిపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను త్వరలోనే పట్టాలెక్కించేసి, అంతే త్వరగా పూర్తి చేయాలని చిత్ర వర్గాలు చూస్తున్నాయట. అయితే ఈ సినిమాలో మహేష్‌తో పాటు ఓ నందమూరి హీరో కూడా నటిస్తాడని తెలుస్తోంది. ఈ సినిమాలోని ఓ కీలక పాత్రలో నందమూరి తారకరత్న నటించబోతున్నాడని తెలుస్తోంది. ఆయన పాత్ర ఈ సినిమాలో చాలా కీలకంగా ఉంటుంని చిత్ర యూనిట్ అంటోంది.
Mahesh Babu: మహేష్ కోసం త్రివిక్రమ్ పాతదే వాడేస్తాడా?
కానీ ఈ విషయంపై ఇంకా అఫీషియల్‌గా ఎలాంటి అనౌన్స్మెంట్ అయితే రాలేదు. ఒకవేళ ఇది నిజం అయితే మాత్రం.. మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సినిమాలో నందమూరి హీరోకు ఎలాంటి పాత్ర లభిస్తుందా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంటుంది. ఇక ఈ సినిమాలో అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుండటంతో ఈ సినిమాలో ఆమె పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుందని.. రొటీన్ సినిమాల్లో లాగా కాకుండా ఈసారి ఆమె పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని చిత్ర యూనిట్ అంటోంది. మొత్తానికి మహేష్ బాబు సినిమాలో నందమూరి తారక రత్న ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి ఈ వార్త నిజం అయితే గనక, ఈ సినిమాను చూసేందుకు మహేష్ అభిమానులతో పాటు నందమూరి అభిమానులు కూడా థియేటర్లకు క్యూ కడతారు.
- Vaishnav Tej : త్రివిక్రమ్‌తో మెగా మేనల్లుడు వైష్ణవ్‌తేజ్ సినిమా..
- Mahesh Babu: యాక్షన్‌తోనే మహేష్ యాక్షన్ షురూ..?
- Mahesh Babu: ఆ డైరెక్టర్‌తో హ్యాట్రిక్ కొడతానంటోన్న మహేష్..?
- Mahesh Babu : ‘సర్కారు వారి పాట’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. అందులోనే..
- Adivi Sesh : పాఠశాల విద్యార్థులకు ‘మేజర్’ బంపర్ ఆఫర్..
1Kotamreddy Sridhar Reddy : ప్రతిపక్ష నేతలను వేధించొద్దు, శత్రువుల్లా చూడొద్దు-వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
2Aaditya Thackeray: ఇది సత్యానికి, అసత్యానికి మధ్య యుద్దం: ఆదిత్యా థాక్రే
3Anjali: సూర్యుడికే చెమటలు పట్టించే తెలుగు బ్యూటీ అందాలు!
4TS EAMCET-2022 : తెలంగాణ ఎంసెట్ హాల్‌టికెట్లు.. డౌన్లోడ్ చేసుకున్నారా?
5Teachers G.O: టీచర్ల జీవో రద్దు.. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం
6Acid Bottle : బాబోయ్.. నీళ్లు అడిగితే యాసిడ్ బాటిల్ ఇచ్చిన షాపింగ్ మాల్ సిబ్బంది
7Srinidhi Shetty: భారీగా పెంచేసి చేతులు కాల్చుకున్న బ్యూటీ!
8Rocketry : ఇస్రోకు పంచాంగంతో ముడిపెట్టిన హీరో మాధవన్.. ఏకిపారేసిన నెటిజన్లు..!
9Tirumala : వసంతమండపంలో ” అరణ్యకాండ పారాయణ దీక్ష ” ప్రారంభం
10Delhi Entry Ban: ఢిల్లీలో భారీ వాహనాలకు నో ఎంట్రీ.. కారణం ఇదే
-
DJ Tillu: మళ్లీ లొల్లి షురూ చేస్తోన్న డీజే టిల్లు!
-
Fastag: ఫాస్టాగ్ స్కామ్ నిజమేనా? ప్రభుత్వం ఏం చెబుతోంది?
-
E-passports : ఈ-పాస్‌పోర్టులు వస్తున్నాయి.. ఇక మీ డేటా సేఫ్.. ఎలా పనిచేస్తాయంటే?
-
Punjab : రోడ్డుపై స్టెప్పులు వేసిన F3 హీరోయిన్.. వీడియో వైరల్
-
Shah Rukh Khan: 30 ఏళ్ల సినీ కెరీర్లో షారుఖ్‌ను ‘కింగ్’ ఖాన్ చేసిన డైలాగులు ఇవే!
-
Himachal Pradesh : బర్త్ డే గిఫ్ట్ అదిరింది.. భార్యకు చంద్రుడుపై స్థలం కొన్న భర్త
-
Venkatesh: మల్టీస్టారర్‌కే చిరునామా.. సోలోగా రావా వెంకీ మామ..?
-
Apple AirPods Pro : ఆపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రోలో హెల్త్ ఫీచర్లు.. అవేంటో తెలుసా?