బాలయ్య 50వ చిత్రం.. 30 ఏళ్ల ‘నారీ నారీ నడుమ మురారి’..

  • Published By: vijay ,Published On : April 25, 2020 / 09:51 AM IST
బాలయ్య 50వ చిత్రం.. 30 ఏళ్ల ‘నారీ నారీ నడుమ మురారి’..

యువరత్న నందమూరి బాలకృష్ణ నటించిన కుటుంబ కథా చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’.. 1990 ఏప్రిల్ 27న విడుదలైన ఈ సినిమా 2020 ఏప్రిల్ 27 నాటికి విజయవంతంగా 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది. (వికీపిడియాలో ఏప్రిల్ 25) యువ చిత్ర ఆర్ట్స్ పతాకంపై, స్టార్ డైరెక్టర్ ఎ.కోదండరామి రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో శోభన, నిరోషా కథానాయికలు కాగా, ‘నవరస నటనా సార్వభౌమ’ కైకాల సత్యనారాయణ, ‘ఊర్వశి’ శారద కీలక పాత్రలు పోషించారు. కెరీర్లో 50వ చిత్రం అయినా ఎటువంటి కమర్షియల్ హంగులకు పోకుండా కుటుంబ కథా చిత్రాన్ని ఎంపిక చేసుకుని.. ప్రేక్షకాభిమానులను అలరించాడు బాలయ్య.

nbk1

ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. కె.వి.మహదేవన్ స్వరపరచిన పాటలు, నేపథ్య సంగీతం, ఎ.విన్సెంట్, అజయ్ విన్సెంట్ కెమెరా వర్క్, ఆచార్య ఆత్రేయ, వేటూరి, సిరివెన్నెల పాటలు, తనికెళ్ల భరణి, భమిడిపాటి రాధాకృష్ణ, జి,సత్యమూర్తి, వినాయక శర్మ రాసిన మాటలు సినిమాకు ప్లస్ అయ్యాయి. బాలయ్య నటన, కామెడీ టైమింగ్, డ్యాన్సులు అభిమానులను అలరించాయి. ఈ సినిమాలో ఒక్క ఫైట్ కూడా లేకపోవడం విశేషం. బాలయ్య నటజీవితంలో ‘నారీ నారీ నడుమ మురారి’ ప్రత్యేకమైన చిత్రం అని చెప్పొచ్చు. 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అలాగే లాక్‌డౌన్ కారణంగా ఖాళీ సమయం దొరికింది కాబట్టి కుటుంబ సమేతంగా ‘నారీ నారీ నడుమ మురారి’  చూసేయండి మరి.

nbk2