NBK107 Eyes On Dussehra Release: పండగకే దిగుతానంటోన్న బాలయ్య.. ఫ్యాన్స్ కోసమేనట!

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం NBK107 అనే వర్కింగ్ టైటిల్‌తో చిత్రీకిరణ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో క్రియేట్ అయ్యాయి. కాగా ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఫైనల్ స్టేజీలో ఉంది. ఈ సినిమాను ఎట్టిపరిస్థితుల్లో దసరా కానుకగా రిలీజ్ చేయాలని బాలయ్య నిర్ణయం తీసుకున్నాడట.

NBK107 Eyes On Dussehra Release: పండగకే దిగుతానంటోన్న బాలయ్య.. ఫ్యాన్స్ కోసమేనట!
ad

NBK107 Eyes On Dussehra Release: నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం NBK107 అనే వర్కింగ్ టైటిల్‌తో చిత్రీకిరణ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

NBK108 Movie: బాలయ్య నెక్ట్స్ మూవీ అఫీషియల్ అప్డేట్ వచ్చేసింది!

కాగా ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఫైనల్ స్టేజీలో ఉంది. దీంతో ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని బాలయ్య ఫిక్స్ అయ్యాడట. అందుకే ప్రస్తుతం ఇండస్ట్రీలో సినిమా షూటింగ్‌లు ఆగిపోయినా, బాలయ్య తన సినిమా షూటింగ్‌ను విదేశాల్లో పూర్తి చేయాలని చూస్తున్నాడట. ఈ మేరకు చిత్ర యూనిట్‌కు ఆదేశాలు కూడా జారీ చేశాడట. అంతేగాక, ఈ సినిమాను ఎట్టిపరిస్థితుల్లో దసరా కానుకగా రిలీజ్ చేయాలని బాలయ్య నిర్ణయం తీసుకున్నాడట.

NBK107: బాలయ్య అభిమానులకు ఈఏడాది లేనట్టే..?

దసరా సీజన్ అయితే తన సినిమాకు బాగా కలిసొస్తుందని భావిస్తున్న బాలయ్య, ఈ మేరకు చిత్ర యూనిట్‌కు కూడా ఇదే విషయాన్ని చెప్పాడట. దీంతో వారు కూడా ఈ సినిమాను దసరా బరిలో రిలీజ్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్య ఊరమాస్ అవతారంలో కనిపిస్తుండగా, అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.