NBK107: భారీ రేటుకు అమ్ముడైన బాలయ్య సినిమా నాన్-థియేట్రికల్ రైట్స్..?

నందమూరి బాలకృష్ణ గతేడాది ‘అఖండ’ చిత్రంతో బాక్సాఫీస్‌ను చెడుగుడు ఆడేశాడు. ఇక బాలయ్య ప్రస్తుతం తన కెరీర్‌లోని 107వ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే విధంగా చిత్ర యూనిట్ తీర్చిదిద్దుతుండటంతో, ఈ సినిమా నాన్-థియేట్రికల్ రైట్స్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది.

NBK107: భారీ రేటుకు అమ్ముడైన బాలయ్య సినిమా నాన్-థియేట్రికల్ రైట్స్..?

NBK107 Non Theatrical Rights Sold For Huge Price

NBK107: నందమూరి బాలకృష్ణ గతేడాది ‘అఖండ’ చిత్రంతో బాక్సాఫీస్‌ను చెడుగుడు ఆడేశాడు. ఇక బాలయ్య ప్రస్తుతం తన కెరీర్‌లోని 107వ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తోంది. కాగా ఈ సినిమాతో మరోసారి బాలయ్య పక్కా యాక్షన్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు.

BalaKrishna: NBK107 సెట్ లో నందమూరి మోక్షజ్ఞ.. అందుకోసమేనా!

ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. ఇక ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో ఓ ఇంట్రెస్టింగ్ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే విధంగా చిత్ర యూనిట్ తీర్చిదిద్దుతుండటంతో, ఈ సినిమా నాన్-థియేట్రికల్ రైట్స్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో ఈ సినిమాకు సంబంధించిన నాన్-థియేట్రికల్ రైట్స్‌ను చిత్ర యూనిట్ భారీ రేటుకు అమ్మినట్లుగా తెలుస్తోంది. దాదాపు రూ.60 కోట్ల భారీ రేటుకు NBK107 చిత్ర నాన్-థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లుగా చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

NBK107: బాలయ్యతో డైరెక్టర్ సెల్ఫీ.. వైరల్ అవుతున్న ఫోటో!

ఈ రేంజ్‍‌లో ఈ బిజినెస్ జరగడానికి దర్శకుడు గోపీచంద్ మలినేని, బాలయ్య కాంబినేషన్ ముఖ్య కారణమని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకున్న క్రేజ్ దృష్ట్యా ఈ చిత్రం థియేట్రికల్ బిజినెస్ రూ.70 కోట్ల వరకు జరుగుతుందని సినీ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. బాలయ్య రెండు విభిన్న లుక్స్‌తో కనిపిస్తున్న ఈ సినిమాలో అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. మరి ఈ సినిమాతో బాలయ్య బాక్సాఫీస్ వద్ద ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.