NBK108: అఫీషియల్.. బాలయ్యతో సినిమా కన్ఫం చేసిన అనిల్ రావిపూడి!

నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ (జూన్ 10) సోషల్ మీడియాలో బాలయ్య అభిమానులు దుమ్ములేపుతున్నారు. ఇప్పటికే బాలయ్య 107వ చిత్రానికి.....

NBK108: అఫీషియల్.. బాలయ్యతో సినిమా కన్ఫం చేసిన అనిల్ రావిపూడి!

NBK108: నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ (జూన్ 10) సోషల్ మీడియాలో బాలయ్య అభిమానులు దుమ్ములేపుతున్నారు. ఇప్పటికే బాలయ్య 107వ చిత్రానికి సంబంధించిన మాస్ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేయడంతో, ఈ టీజర్‌ను అభిమానులు ట్రెండింగ్ చేస్తున్నారు. ఇక తాజాగా బాలయ్య 108వ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌ను దర్శకుడు అనిల్ రావిపూడి చేశాడు.

NBK108: బాలయ్య సినిమాకు అల్ట్రా స్టైలిష్ టైటిల్.. నిజమేనా?

గతంలోనే బాలయ్యతో అనిల్ తన నెక్ట్స్ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా.. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేశారు చిత్ర యూనిట్. ఈ సినిమాను బాలయ్య అభిమానులు మెచ్చే విధంగా తీర్చిదిద్దబోతున్నట్లు అనిల్ రావిపూడి వెల్లడించారు. ఇక ఈ సినిమాలో బాలయ్య ఓ తండ్రి పాత్రలో కనిపిస్తాడని.. ఆయన కూతురు పాత్రలో యంగ్ బ్యూటీ శ్రీలీలా నటించబోతున్నట్లు అనిల్ రావిపూడి ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఈ సినిమా కథ ఎలా ఉండబోతుందా.. అసలు ఈ సినిమాలో బాలయ్య లుక్ ఎలా ఉంటుందా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

NBK108: బాలయ్య కోసం సీనియర్ హీరోయిన్..?

ఇక ఈ సినిమా అనౌన్స్‌మెంట్ రావడంతో, ఇప్పుడు NBK108 అనే హ్యాష్‌ట్యాగ్‌ను కూడా అభిమానులు ట్రెండింగ్ చేస్తున్నారు. కాగా.. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపాడు. ఏదేమైనా బాలయ్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ మిగతా సీనియర్ హీరోలకు గట్టి పోటీనిస్తున్నాడని చెప్పాలి.