Swathimuthyam: నీ చారెడు కళ్లే.. అంటూ పాటందుకున్న స్వాతిముత్యం!

ప్రేమ తాలూకు భావోద్వేగాలు ఎప్పుడూ కొత్తగానే ఉంటాయి. ఓ అమ్మాయికి, ఓ అబ్బాయికి మధ్య పరిచయం, అది ప్రేమ వైపు సాగే ప్రయాణం, దాని తాలూకు అనుభూతులు.....

Swathimuthyam: నీ చారెడు కళ్లే.. అంటూ పాటందుకున్న స్వాతిముత్యం!

Nee Chaaredu Kalle Song Out From Swathimuthyam

Swathimuthyam: ప్రేమ తాలూకు భావోద్వేగాలు ఎప్పుడూ కొత్తగానే ఉంటాయి. ఓ అమ్మాయికి, ఓ అబ్బాయికి మధ్య పరిచయం, అది ప్రేమ వైపు సాగే ప్రయాణం, దాని తాలూకు అనుభూతులు, జరిగే సంఘటనలు, వాటి సందర్భాలు… ఇవన్నీ ఎంత కొత్తగా వుంటే అంతగా మనసును హత్తుకుంటాయి. తాజాగా విడుదలైన ‘స్వాతిముత్యం’ చిత్రంలోని పాట కూడా అలానే అనిపిస్తుంది, ఆకట్టుకుంటుంది. గణేష్ బెల్లంకొండ హీరోగా ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం ‘స్వాతిముత్యం’. వర్ష బొల్లమ్మ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. లక్ష్మణ్.కె.కృష్ణ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇక ఈ సినిమాలోని రొమాంటిక్ ఫీల్ గుడ్ సాంగ్ ను చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేసింది.

వర్ష బొల్లమ్మతో “నీ చారెడు కళ్లే చదివేస్తూ ఉన్నా… నీ మత్తులో మళ్లీ పడిలేస్తూ ఉన్నా” అంటూ పాటందుకున్నాడు హీరో గణేష్. ఈ బ్యూటీఫుల్ రొమాంటిక్ పాటకు రచయిత కెకె లిరిక్స్ అందించగా, అర్మాన్ మాలిక్, సంజన కల్ మంజే అద్భుతంగా ఆలపించారు. మహతి స్వర సాగర్ సంగీతంలో వచ్చిన ఈ పాట శ్రోతలను అమితంగా ఆకట్టుకుంటోంది. గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీలో వచ్చిన ఈ పాట ప్రేక్షకులను ఖచ్చితంగా అలరిస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

Swathimuthyam : చిన్న బెల్లంకొండ ‘స్వాతిముత్యం’..

ఇక ఈ పాట విడుదలైన క్షణం నుంచే అది ఆకట్టుకుంటున్న వైనం, సామాజిక మాధ్యమాల వేదికగా ప్రశంసలు సంతోషాన్ని కలిగిస్తున్నాయని అన్నారు చిత్ర దర్శకుడు లక్ష్మణ్. ప్రతి పాటకు ప్రసవ వేదన ఉంటుంది. ఈ పాట కూడా అందుకు మినహాయింపు ఏమీ కాదు. ఈ పాట కొన్ని పర్యాయాలు రాసిన తరువాతే అందరికీ ఆమోదయోగ్యమయింది. దర్శకుడు చెప్పిన సందర్భానికి, సంగీత దర్శకుని బాణీలకు, నిర్మాత అభిరుచికి తగినట్లుగా సాహిత్యం అందించటం ఆనందంగా ఉందని రచయిత కెకె అన్నారు.

Bellamkonda Ganesh: స్కూటర్ ఎక్కిన స్వాతిముత్యం.. వచ్చేది ఎప్పుడంటే?

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని ఆగస్టు 13న విడుదల చేస్తున్నట్లు నిర్మాత సూర్య దేవర నాగవంశీ తెలిపారు. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తున్నారు. ప్రేమతో కూడిన వినోదభరిత కుటుంబ కథా చిత్రం ‘స్వాతిముత్యం’. సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ చిత్రంగా ‘స్వాతిముత్యం’ను దర్శకుడు తీర్చిదిద్దారని నిర్మాత తెలిపారు. గణేష్, వర్ష బొల్లమ్మ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటుడు నరేష్, రావు రమేష్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, సప్తగిరి, హర్ష వర్ధన్, పమ్మి సాయి, గోపరాజు రమణ, శివ నారాయణ, ప్రగతి, సురేఖావాణి, సునయన, దివ్య శ్రీపాద ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.