Netflix : నెట్‌ఫ్లిక్స్ షార్ట్ ఫిలిం కాంటెస్ట్.. గెలిస్తే నెట్‌ఫ్లిక్స్‌లో సినిమా ఛాన్స్

తాజాగా ఇండియాలో నెట్ ఫ్లిక్స్ ని ఇంకా మార్కెట్ చేయడానికి కొత్తగా ఓ కాంటెస్ట్ ని నిర్వహిస్తోంది. ఈ కాంటెస్ట్ లో గెలిచిన వాళ్ళకి సినిమా తీయడానికి 7 లక్షల బడ్జెట్ ఇస్తుంది...........

Netflix : నెట్‌ఫ్లిక్స్ షార్ట్ ఫిలిం కాంటెస్ట్.. గెలిస్తే నెట్‌ఫ్లిక్స్‌లో సినిమా ఛాన్స్

Netflix

Netflix :  ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా టాప్ ఓటీటీగా ఆదరణ పొందుతుంది నెట్ ఫ్లిక్స్. ప్రతి రాజు కొత్త కంటెంట్ తో వస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో సినిమాలు, సిరీస్ లు రోజూ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అవుతున్నాయి. 190కి పైగా దేశాల్లో నెట్ ఫ్లిక్స్ ఓటీటీకి సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. ఇండియాలో కూడా నెట్ ఫ్లిక్స్ ఓటీటీ అగ్రస్థానంలో కొనసాగుతోంది. కరోనా రాకతో ఓటీటీల డిమాండ్ పెరగడంతో గత రెండేళ్లలో నెట్ ఫ్లిక్స్ ఇండియాలో లోకల్ లాంగ్వేజెస్ కంటెంట్స్ మీద దృష్టి సారించాయి. అందుకోసం బాగానే ఖర్చు చేస్తుంది. దేశంలోని అన్ని లోకల్ భాషల్లోనూ డైరెక్ట్ సినిమాలు, సిరీస్ లు నిర్మించి రిలీజ్ చేస్తుంది నెట్ ఫ్లిక్స్.

తాజాగా ఇండియాలో నెట్ ఫ్లిక్స్ ని ఇంకా మార్కెట్ చేయడానికి కొత్తగా ఓ కాంటెస్ట్ ని నిర్వహిస్తోంది. ఈ కాంటెస్ట్ లో గెలిచిన వాళ్ళకి సినిమా తీయడానికి 7 లక్షల బడ్జెట్ ఇస్తుంది నెట్ ఫ్లిక్స్. ఆ సినిమాని నెట్ ఫ్లిక్స్ లోనే రిలీజ్ చేస్త్తారు. నెట్ ఫ్లిక్స్ నిర్వహించే ఈ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ లో 18 ఏళ్లు నిండిన భారతీయ పౌరులు ఎవరైనా పాల్గొనవచ్చు. ఈ పోటీలో పాల్గొనాలంటే ‘మై ఇండియా’ అనే అంశంపై రెండు నిమిషాల నిడివి గల షార్ట్ ఫిల్మ్ ను మొబైల్ లో చిత్రీకరించి నెట్ ఫ్లిక్స్ కు పంపాల్సి ఉంటుంది. దాంతో పాటు ‘హోమ్’ అనే అంశంపై సినాప్సిస్ కూడా రాసి పంపాలి. ఫిబ్రవరి 1 నుంచి దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది.

 

టాప్ 10లో సెలెక్ట్ అయిన వాళ్ళు రైటింగ్ – డైరెక్షన్ – ప్రొడక్షన్ వంటి విభాగాల గురించి కూడా నెట్ ఫ్లిక్స్ నుంచి ట్రైనింగ్ తీసుకోవచ్చు. టాప్ 10లో సెలెక్ట్ అయిన షార్ట్ ఫిలిమ్స్ ని నెట్ ఫ్లెక్స్ ఇండియా యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేస్తారు. మరిన్ని వివరాలకు ‘టేక్ టెన్.ఇన్’ అనే వెబ్ సైట్లో చూడాలి.