‘నిశ్శబ్దం’ చూపిస్తామంటూ ప్రకటన.. ఆ ఛానెల్‌కు భారీ జరిమానా..

  • Edited By: sekhar , October 8, 2020 / 02:33 PM IST
‘నిశ్శబ్దం’ చూపిస్తామంటూ ప్రకటన.. ఆ ఛానెల్‌కు భారీ జరిమానా..

Nishabdham Team Issue Notices: టీజర్, ట్రైలర్‌తో సినిమాపై ఎంతో క్యూరియాసిటీ కలిగించిన ‘నిశ్శబ్దం’ మూవీ ఈ నెల రెండో తేదీన Amazon Prime ద్వారా రిలీజ్ అయింది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో, కోన వెంకట్, టీజీ విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. అనుష్క, మాధవన్, అంజలి, షాలినీ పాండే, మైకేల్ మ్యాడిసన్, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్ తదితరులు నటించారు.


తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ లోకల్ ఛానెల్ అతి త్వరలో తమ ఛానెల్‌లో ‘నిశ్శబ్దం’ సినిమాను ప్రదర్శించబోతున్నామని ప్రకటించింది. ఈ విషయం నిర్మాతల దృష్టికి వెళ్లడంతో ఆ ఛానల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతే కాకుండా నష్టపరిహారం కింద రూ.1.1 కోట్లు చెల్లించాలని లీగల్ నోటీస్‌లు కూడా పంపించారు.


అలాగే ఈ సినిమా డిజిటల్ రైట్స్ దక్కించుకున్న Amazon Prime మరో రూ.30 లక్షలు నష్టపరిహారం కోరుతోందని సమాచారం. ఇందుకు సంబంధించిన ఓ వెబ్‌సైట్ కథానాన్ని ప్రచురించగా.. దర్శకుడు హేమంత్ మధుకర్ దానిని రీ-ట్వీట్ చేశారు. ఈ విషయంపై సదరు లోకల్ ఛానెల్ వారి నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.