Janhvi Kapoor: హిందీలో సక్సెస్ లేదు.. సౌత్‌కి రావట్లేదు.. ఏంటో జాన్వీ!

జాన్వీకపూర్ తప్పకుండా తెలుగులో నటిస్తుంది కానీ, ఆమె ప్రస్తుతం ఏ తెలుగు సినిమాకు సైన్ చేయలేదు. ఆమధ్య వలిమై ఈవెంట్ లో ప్రకటించారు బోనీకపూర్. ఉత్తరాదిలో క్రేజ్ సంపాధించిన హీరోయన్స్ దక్షాణాదిలో, దక్షాణాదిలో పాపులరయిన తారలు ఉత్తరాదిలో నటించడం వెరీ కామన్ థింగ్..

Janhvi Kapoor: హిందీలో సక్సెస్ లేదు.. సౌత్‌కి రావట్లేదు.. ఏంటో జాన్వీ!

Janhvi Kapoor (Image:Instagram)

Janhvi Kapoor: జాన్వీకపూర్ తప్పకుండా తెలుగులో నటిస్తుంది కానీ, ఆమె ప్రస్తుతం ఏ తెలుగు సినిమాకు సైన్ చేయలేదు. ఆమధ్య వలిమై ఈవెంట్ లో ప్రకటించారు బోనీకపూర్. ఉత్తరాదిలో క్రేజ్ సంపాధించిన హీరోయన్స్ దక్షాణాదిలో, దక్షాణాదిలో పాపులరయిన తారలు ఉత్తరాదిలో నటించడం వెరీ కామన్ థింగ్.. అయితే అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ గురించి సౌత్ ఆడియన్స్ మధ్య ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంది.

Janhvi Kapoor: వెకేషన్‌లో జాన్వీ.. ఎన్నాళ్ళు ఇలా ఊరిస్తావ్ తల్లో!

ఈ మధ్య జాన్వి కపూర్ రెండు తెలుగు సినిమాల్లో నటిస్తుందని వార్తలొచ్చాయి. రెండూ పాన్ ఇండియా సినిమాలే.. ఒకటి రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సరసన జనగణ మన సినిమాలో అయితే జాన్వీ కపూరే హీరోయిన్ అని అందరూ ఫిక్సయ్యారు. సడెన్ గా ఆ ప్లేస్ లోకి పూజా హెగ్డే వచ్చి చేరింది. ఇప్పుడు కూడా జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ లేనట్టేనా అని ఫీలవుతున్నారు ఇక్కడి ఆడియన్స్.

Janhvi Kapoor: ఫోటో షూట్లతో కిర్రాక్ పుట్టిస్తున్న బబ్లీ బ్యూటీ జాన్వీ!

మరొకటి అక్కినేని అఖిల్ సరసన కరణ్ జోహార్ చేయబోతున్న సినిమాలోనూ నటిస్తుందని వార్తలొచ్చాయి. కాని, ఇప్పుడు ఇదికూడా నిజమని నమ్మడంలేదు టాలీవుడ్ ఆడియన్స్. ఎందుకంటే, గత కొంతకాలం నుంచి జాన్వీ టాలీవుడ్ ఎంట్రీపై గాసిప్స్ చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అల్లు అర్జున్ ఐకాన్ తో జాన్వీ ఎంట్రీ ఉంటుందని, ఎన్టీఆర్, బుచ్చిబాబు కాంబినేషన్ లో రాబోతున్న సినిమాతో జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఉంటుందని, ఇంకా చరణ్ దగ్గరి నుంచి మహేశ్ బాబు వరకు జాన్వీ పేరు గట్టిగానే వినిపించింది. కానీ అవేమి కార్యరూపం దాల్చలేదు.

Janhvi Kapoor: ఆఫర్లు వచ్చినా తెలుగుపై ఆసక్తి చూపని జాన్వీ?

ధడక్ తో బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకొచ్చిన జాన్వీ.. 2021లో రూహీతో పలకరించింది. ప్రస్తుతం దోస్తానా2, గుడ్ లక్ జెర్రీ, మిస్టర్ అండ్ మిసెస్ మహీ, కార్గిల్ గర్ల్, రణ్ భూమి, థక్త్ వంటి ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉంది. కాని, ఇప్పటి వరకూ అక్కడ జాన్వీకి గ్రాండ్ సక్సెసేమీ రాలేదు. అదే టాలీవుడ్ లో శ్రీదేవి వారసురాలన్న క్రేజ్ ఎలాగూ ఉంది. ఇక్కడ స్టార్స్ పాన్ ఇండియా సక్సెస్ లు కొడుతున్నారు. సో ఇక్కడి సినిమాలతో జాన్వీకి గ్రాండ్ సక్సెస్ కొట్టే ఛాన్స్ ఉన్నాకూడా సౌత్ నుంచి పెద్ద పెద్ద స్టార్స్ పక్కన నటించే ఆఫర్స్ వస్తున్నా కూడా వదిలేసుకుంటుంది.. అసలు జన్వీ కపూర్ వైఖరేంటో సౌత్ ఫిలిం మేకర్స్ కు అంతు చిక్కడం లేదు.