NTR : అభిమానులకి క్షమాపణలు చెప్పిన ఎన్టీఆర్.. పోలీసులవల్లే అంటూ..

బ్రహ్మాస్త్ర ప్రెస్ మీట్ లో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ''ముందుగా అభిమానులందరికి క్షమాపణలు. ఈ బ్రహ్మాస్త్ర ఈవెంట్ ని ఎంతో ఆర్భాటంగా చేద్దాం అనుకున్నాం. దీనికి అన్ని రెడీ చేశారు.కానీ గణేష్ ఉత్సవాల సందర్భంగా పోలీసులంతా బిజీగా ఉండటం వల్ల..............

NTR : అభిమానులకి క్షమాపణలు చెప్పిన ఎన్టీఆర్.. పోలీసులవల్లే అంటూ..

NTR Speech in Brahmastra Pressmeet

NTR :  రణబీర్ కపూర్, అలియా జంటగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో మన అస్త్రాల గురించి రాసిన కథతో భారీగా తెరకెక్కిన సినిమా బ్రహ్మాస్త్ర. ఇందులో నాగార్జున, అమితాబ్, మౌనిరాయ్ ముఖ్యపాత్రల్లో నటించారు. పాన్ ఇండియా సినిమాగా బ్రహ్మాస్త్ర సెప్టెంబర్ 9న రిలీజ్ కాబోతుంది.ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ ని భారీగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా టాలీవుడ్, సౌత్ మార్కెట్ ని టార్గెట్ చేసుకొని చిత్ర యూనిట్ ప్రమోషన్స్ చేస్తుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా చేయాలనుకున్నారు. కానీ చివరి నిమిషంలో పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఈవెంట్ క్యాన్సిల్ అయింది.

బ్రహ్మస్త్ర రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ గెస్ట్ గా రానున్నారు అని చెప్పడంతో ఈ ఈవెంట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా ఆతృతగా ఈ ఈవెంట్ కోసం ఎదురు చూశారు. అయితే చివరి నిమిషంలో ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడంతో అభిమానులు నిరాశకి గురయ్యారు. ఈవెంట్ క్యాన్సిల్ కావడంతో, చిత్ర యూనిట్ అంతా ముంబై నుంచి రావడంతో సిటీలోని ఓ హోటల్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈవెంట్ క్యాన్సిల్ కావడానికి వినాయక సంబరాలు జరుగుతున్నందున పోలీసులు బందోబస్తు ఇవ్వలేకపోయారు అని కారణం తెలిపారు. ఇక ప్రెస్ మీట్ లో చిత్ర యూనిట్ తో పాటు రాజమౌళి, ఎన్టీఆర్ మాట్లాడారు.

బ్రహ్మాస్త్ర ప్రెస్ మీట్ లో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ”ముందుగా అభిమానులందరికి క్షమాపణలు. ఈ బ్రహ్మాస్త్ర ఈవెంట్ ని ఎంతో ఆర్భాటంగా చేద్దాం అనుకున్నాం. దీనికి అన్ని రెడీ చేశారు.కానీ గణేష్ ఉత్సవాల సందర్భంగా పోలీసులంతా బిజీగా ఉండటం వల్ల ఈవెంట్ కి పర్మిషన్ ఇవ్వలేదు. పోలీసులు కూడా మన రక్షణ కోసమే పని చేస్తారు. అందుకే ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా వారి నిర్ణయాన్ని గౌరవించాలి. ఈవెంట్ కి వచ్చిన, వద్దామనుకున్న అభిమానులందరికి క్షమాపణలు చెప్తున్నాను.”

Brahmastra Pre-Release Event: బ్రహ్మాస్త్రంకు పొలిటికల్ టచ్.. అందుకే వాయిదా..?

”సినీ పరిశ్రమలో నాకు చాలా మంది ఆర్టిస్టులు నచ్చుతారు. అమితాబ్ గారికి నేను చాలా పెద్ద ఫ్యాన్. అమితాబ్ గారి తర్వాత బాలీవుడ్ లో రణబీర్ అంటే నాకు ఇష్టం. రణబీర్ రాక్ స్టార్ సినిమా చాలా సార్లు చూశాను. రాక్ స్టార్ సినిమా పాటలు వింటూనే ఉంటాను. అలియా నా డార్లింగ్. RRR సినిమాతో మేమిద్దరం చాలా క్లోజ్ అయ్యాం. ఇండియాలో ఉన్న మంచి యాక్ట్రస్ లో అలియా ఒకరు. రాజమౌళి, కరణ్ జోహార్ లు ఇద్దరూ రెండు సినీ పరిశ్రమలని ఒకటిగా చేసి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ గా మార్చారు. వారిద్దరి వల్లే ఇండియన్ సినీ పరిశ్రమ ఇప్పుడు ఈ రేంజ్ లో ఉంది. బ్రహ్మాస్త్ర డైరెక్టర్ అయాన్ రాలేదు. సినిమా వర్క్స్ లో బిజీగా ఉన్నాడు. రానందుకు నాకు చాలా సార్లు సారీ చెప్పాడు. సినిమా రిలీజ్ టైం అంటే డైరెక్టర్ కి అలాగే ఉంటుంది. ఇన్ని పెద్ద సినిమాలు తీసిన రాజమౌళి కూడా సినిమా రిలీజ్ ముందు భయపడతారు. ఇక మా నాగార్జున బాబాయ్ మళ్ళీ చాలా రోజుల తర్వాత హిందీలో చేస్తున్నారు. నేను ఒక తెలుగు హీరో హిందీలో చేసిన సినిమాల్లో ఫస్ట్ చూసింది నాగార్జున బాబాయ్ సినిమానే. నాగ్ బాబాయ్ కి హిందీలో మంచి హిట్ ఇవ్వాలి బ్రహ్మాస్త్ర సినిమా.”

”మనం దేశంలో ప్రస్తుతం చాలా మంచి పొజిషన్ లో ఉన్నాము. ఇటీవలే 75 సంవత్సరాల స్వతంత్ర దినోత్సవ వేడుకల్ని చేసుకున్నాము. అలాగే ఇప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఒక ప్రెజర్ కు గురవుతుంది. ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారు. ఇండస్ట్రీ ప్రేక్షకులు ఇచ్చిన ఛాలెంజ్ ని తీసుకొని మంచి సినిమాలు తీయాలి. వారిని మెప్పించే సినిమాలు తీసి ఆ ప్రెజర్ నుంచి బయటపడాలి” అని తెలిపారు.