Brahmastra Pre-Release Event: బ్రహ్మాస్త్రంకు పొలిటికల్ టచ్.. అందుకే వాయిదా..?

బాలీవుడ్‌లో సెన్సేషనల్ మూవీగా తెరకెక్కిన ‘బ్రహ్మాస్త’ తెలుగులో బ్రహ్మాస్త్రం పేరుతో రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాలో యంగ్ హీరో రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటిస్తుండగా, బిగ్ బి అమితాబ్ బచ్చన్, అక్కినేని నాగార్జున వంటి స్టార్స్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఇవాళ రామోజీ ఫిలిం సిటీలో నిర్వహించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.

Brahmastra Pre-Release Event: బ్రహ్మాస్త్రంకు పొలిటికల్ టచ్.. అందుకే వాయిదా..?

Brahmastra Pre-Release Event Cancelled For This Reason

Brahmastra Pre-Release Event: బాలీవుడ్‌లో సెన్సేషనల్ మూవీగా తెరకెక్కిన ‘బ్రహ్మాస్త’ తెలుగులో బ్రహ్మాస్త్రం పేరుతో రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాలో యంగ్ హీరో రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటిస్తుండగా, బిగ్ బి అమితాబ్ బచ్చన్, అక్కినేని నాగార్జున వంటి స్టార్స్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ భారీ మూవీని తెలుగులో స్టార్ డైరెక్టర్ రాజమౌళి రిలీజ్ చేస్తుండటంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఇవాళ రామోజీ ఫిలిం సిటీలో నిర్వహించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.

Brahmastra Pre-Release Event: ప్రీరిలీజ్ ఈవెంట్‌కు రెడీ అయిన బ్రహ్మాస్త్రం.. చివరి నిమిషంలో షాకిచ్చిన పోలీసులు!

కానీ, చివరి నిమిషంలో పోలీసులు ఈ ఈవెంట్‌కు అనుమతి లేదని, తాము ఈ ఈవెంట్‌కు సెక్యూరిటీ ఇవ్వలేమని తేల్చడంతో బ్రహ్మాస్త్రం ప్రీరిలీజ్ ఈవెంట్ వాయిదా పడింది. అయితే ఇప్పుడు ఈ ఈవెంట్ రద్దు ఇండస్ట్రీలో సరికొత్త చర్చకు తెరలేపింది. బ్రహ్మాస్త్రం సినిమా ఈవెంట్ రాజకీయ కారణాల వల్లే ఆగిపోయిందనే వార్త ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ఈ ఈవెంట్‌కు జూ.ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్‌గా వస్తుండటంతోనే, ఈ ఈవెంట్‌ను క్యాన్సిల్ చేశారనే టాక్ వినిపిస్తోంది. దీని వెనకాల టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అంశం ఉందని పలువురు కామెంట్ చేస్తున్నారు.

NTR : ‘బ్రహ్మాస్త్ర’ ప్రీరిలీజ్ ఈవెంట్‎కు చీఫ్ గెస్టుగా ఎన్టీఆర్

ఇటీవల ఎన్టీఆర్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాను హైదరాబాద్‌లో కలిసిన సంగతి తెలిసిందే. అంతేగాక హీరో నితిన్ కూడా ఇటీవల బీజేపీ నేత నడ్డాను కలిశాడు. టాలీవుడ్ హీరోలు ఇలా వరుసగా బీజేపీతో సన్నిహితంగా ఉండటమే కేసీఆర్ సర్కార్‌కు ఆగ్రహం తెప్పించదని.. అంతేగాక రచయిత విజయేంద్ర ప్రసాద్ కూడా రజాకార్ ఫైల్స్ అనే కథను రెడీ చేస్తుండటం.. బ్రహ్మాస్త్రం సినిమాకు బీజేపీ నాయకుల సపోర్ట్ ఉండటంతోనే తెలంగాణ సర్కార్ ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను రద్దు చేసిందట. ఈ ఈవెంట్‌కు తాము సెక్యూరిటీ ఇవ్వలేమని పోలీసులు తెలిపారు. అయితే ఇటీవల మునావర్ షోకు భారీ బందోబస్తు ఇచ్చిన పోలీసులు, బ్రహ్మాస్త్రం ఈవెంట్ విషయంలో ఇలా చేయడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. టాలీవుడ్‌కు తెలంగాణ సర్కార్ ఎంత సహకరిస్తున్నా, ఇండస్ట్రీలోని వారు మాత్రం బీజేపీకి అనుకూలంగా ఉండటంతో కేసీఆర్ సర్కార్ ఇలాంటి ఝలక్ ఇచ్చిందనే టాక్ ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో, రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.