NTR31: ఎన్టీఆర్‌ను అలా చూపిస్తానంటోన్న ప్రశాంత్ నీల్.. థియేటర్లలో రీసౌండ్ రావాల్సిందేనట!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్టుల కోసం కసరత్తు చేస్తున్నాడు. ఇప్పటికే తన నెక్ట్స్ సినిమాలను స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో, దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే కొరటాలతో చేయబోయే ఎన్టీఆర్ 30వ చిత్రం కంటే కూడా అందరి చూపులు ప్రశాంత్ నీల్‌తో చేయబోయే ఎన్టీఆర్ 31వ సినిమాపైనే ఉన్నాయి. ఈ సినిమాలో దర్శకుడు ప్రశాంత్ నీల్ తారక్‌ను ఎలా చూపించబోతున్నాడనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

NTR31: ఎన్టీఆర్‌ను అలా చూపిస్తానంటోన్న ప్రశాంత్ నీల్.. థియేటర్లలో రీసౌండ్ రావాల్సిందేనట!

NTR To Be Shown Like This By Prashant Neel In NTR31

NTR31: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్టుల కోసం కసరత్తు చేస్తున్నాడు. ఇప్పటికే తన నెక్ట్స్ సినిమాలను స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో, దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే కొరటాలతో చేయబోయే ఎన్టీఆర్ 30వ చిత్రం కంటే కూడా అందరి చూపులు ప్రశాంత్ నీల్‌తో చేయబోయే ఎన్టీఆర్ 31వ సినిమాపైనే ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-లుక్ పోస్టర్‌తోనే ఈ సినిమాపై హైప్‌ను ఓ రేంజ్‌లో క్రియేట్ చేశాడు తారక్.

Prashanth Neel On NTR31: ఎన్టీఆర్ సినిమాపై ప్రశాంత్ నీల్ క్లారిటీ!

ఇక ఈ సినిమాను ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా, ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో దర్శకుడు ప్రశాంత్ నీల్ తారక్‌ను ఎలా చూపించబోతున్నాడనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాను పూర్తి మాస్ యక్షన్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ తీర్చిదిద్దనుండగా.. ఈ సినిమాలో తారక్‌లోని నటుడిని పూర్తిగా వాడుకోనున్నాడట ఈ డైరెక్టర్.

NTR31: ఎన్టీఆర్ మళ్లీ అలా కనిపిస్తాడా?

ఈ సినిమాలో తారక్‌ను డ్యుయెల్ రోల్‌లో చూపించనున్నాడట ప్రశాంత్ నీల్. ఇక ఇందులో ప్రతినాయకుడు, నాయకుడు రెండు పాత్రల్లోనూ తారక్ విధ్వంసకర పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నాడట. ఇక విలన్ పాత్రలో తారక్ చేసే యాక్టింగ్‌కు ప్రేక్షకులకు గూస్ బంప్స్ రావడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఇక ఈ రోల్‌తో తారక్ చేసే సౌండ్, థియేటర్లో రీసౌండ్ వస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. మొత్తానికి తారక్‌ను ఇప్పటివరకు ఎవరూ చూపించనంత పవర్‌ఫుల్ పాత్రలో ప్రశాంత్ నీల్ చూపించబోతున్నాడనే వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో తెగ చక్కర్లు కొడుతోంది.