Prashanth Neel On NTR31: ఎన్టీఆర్ సినిమాపై ప్రశాంత్ నీల్ క్లారిటీ!

కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కేజీయఫ్ చిత్రాలతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేశాడో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ డైరెక్టర్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో కలిసి ‘సలార్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. తన నెక్ట్స్ చిత్రాన్ని యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కలిసి చేయబోతున్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేశారు.

Prashanth Neel On NTR31: ఎన్టీఆర్ సినిమాపై ప్రశాంత్ నీల్ క్లారిటీ!

Prashanth Neel On NTR31 Gives Sensation Hint

Prashanth Neel On NTR31: కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కేజీయఫ్ చిత్రాలతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేశాడో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ డైరెక్టర్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో కలిసి ‘సలార్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసింది. కాగా ప్రశాంత్ నీల్ తన నెక్ట్స్ చిత్రాన్ని యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కలిసి చేయబోతున్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేశారు.

Prashanth Neel : ప్రశాంత్ నీల్ బర్త్‌డే & KGF2 50 డేస్ సెలబ్రేషన్స్

అయితే ఈ సినిమాకు సంబంధించి కేవలం అనౌన్స్‌మెంట్ మాత్రమే చేశారు చిత్ర యూనిట్. దీంతో ఈ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్తను రివీల్ చేశారు. ఎన్టీఆర్ 31వ చిత్రాన్ని త్వరలోనే పట్టాలెక్కిస్తారా అని మీడియా వారు ఆయన్ను అడగ్గా, ఏప్రిల్ లేదా మే నెలలో ఎన్టీఆర్‌తో సినిమాను పట్టాలెక్కిస్తామని ఆయన తెలిపారు.

Prashanth Neel : కేజిఎఫ్ సినిమాలో అందరికి గడ్డాలు ఎందుకు ఉన్నాయో తెలుసా ??

ఇక పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను చిత్ర యూనిట్ తెరకెక్కించేందుకు రెడీ అవుతుండగా, ఈ సినిమాలో ఎన్టీఆర్ సరికొత్త లుక్‌లో కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. ఇక ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో ప్రశాంత్ నీల్ తెలపడంతో, అభిమానులు ఈ సినిమా కోసం అప్పుడే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.