Prashanth Neel : కేజిఎఫ్ సినిమాలో అందరికి గడ్డాలు ఎందుకు ఉన్నాయో తెలుసా ??

ఈ సినిమాలో హీరో, విలన్ తో పాటు ప్రతి ఒక్క మెయిన్ క్యారెక్టర్ కి గడ్డం ఉంటుంది. అయితే సినిమాలో ఎందుకు అందరికి గడ్డాలు పెట్టారు అని ఇంటర్వ్యూలో యాంకర్ ప్రశాంత్ నీల్ ని...........

Prashanth Neel : కేజిఎఫ్ సినిమాలో అందరికి గడ్డాలు ఎందుకు ఉన్నాయో తెలుసా ??

Prashanth

KGF :  రాకింగ్ స్టార్ యశ్ హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కేజీఎఫ్’ రెండు భాగాలు ఎంత భారీ విజయం సాధించాయి అందరికి తెలిసిందే. మొదటి పార్ట్ కంటే కూడా ‘కేజీఎఫ్ 2’ మరింత భారీ విజయం సాధించింది. ఇప్పటికే 800 కోట్ల కలెక్షన్లు సాధించి 1000 కోట్ల క్లబ్ లోకి దూసుకెళ్తుంది ‘కేజీఎఫ్ 2’ సినిమా. దేశం మొత్తం సినిమాని, యశ్ ని, సినిమా తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ ని పొగుడుతున్నారు.

 

ఇక సినిమా భారీ సక్సెస్ అవ్వడంతో సినిమాలోని ఆర్టిస్టులు, సినిమా కోసం వర్క్ చేసిన వారి ఇంటర్వ్యూల కోసం మీడియా ట్రై చేస్తుంది. తాజాగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలని తెలియచేశాడు. ఈ సినిమాలో హీరో, విలన్ తో పాటు ప్రతి ఒక్క మెయిన్ క్యారెక్టర్ కి గడ్డం ఉంటుంది. దాదాపు 95 శాతం జెంట్ క్యారెక్టర్స్ అందరికి సినిమాలో గడ్డం ఉంటుంది. అయితే సినిమాలో ఎందుకు అందరికి గడ్డాలు పెట్టారు అని ఇంటర్వ్యూలో యాంకర్ ప్రశాంత్ నీల్ ని అడిగారు. నీల్ దీనికి విచిత్రమైన సమాధానం ఇచ్చారు.

Vedaant Madhavan : ఒలంపిక్స్ లక్ష్యంగా కొడుకుని తయారు చేస్తున్న మాధవన్

ప్రశాంత్ నీల్ ఈ ప్రశ్నకి సమాధానమిస్తూ.. ”నేను నా మొదటి సినిమా ‘ఉగ్రం’ చేసేటప్పుడు క్లీన్ షేవ్ తో ఉన్నాను. ఆ సమయంలో ఒకతను నా దగ్గరకు వచ్చి ఈ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎవరు అని నన్నే అడిగాడు. ఆ మూవీ రిలీజ్ అయిన తర్వాత కూడా నువ్వేనా డైరెక్టర్ అని అడిగేవారు. గడ్డం లేకపోవడంతో అందరు నన్ను చిన్నవాడిలా చూసేవారు. దాంతో నాకు చాలా కోపం వచ్చింది. ఆ కోపం అంతా ‘కేజీఎఫ్’ సినిమాలో చూపించాను. ఆ కోపంతోనే ‘కేజీఎఫ్’ సినిమాలో ప్రతి ఒక్కరికి గడ్డం పెట్టించాను. నేను కూడా అప్పట్నుంచి గడ్డం మెయింటైన్ చేస్తున్నాను” అని తెలిపారు. ఈ సమాధానం విని అంతా ఆశ్చర్యపోతున్నారు.

Prashanth Neel