జయలలిత జయంతి – వైరల్ అవుతున్న‘తలైవి’ కొత్త లుక్..

దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత 72వ జయంతి సందర్భంగా ‘తలైవి’ కొత్త లుక్ విడుదల..

  • Published By: sekhar ,Published On : February 24, 2020 / 06:03 AM IST
జయలలిత జయంతి – వైరల్ అవుతున్న‘తలైవి’ కొత్త లుక్..

దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత 72వ జయంతి సందర్భంగా ‘తలైవి’ కొత్త లుక్ విడుదల..

నటి, దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం.. ‘తలైవి’.. బాలీవుడ్‌ ‘క్వీన్‌’ కంగనా రనౌత్‌ జయలలిత పాత్రలో నటిస్తున్నారు. ఏ.ఎల్‌. విజయ్‌ దర్శకత్వంలో విష్ణువర్ధన్‌ ఇందూరి, శైలేష్‌ ఆర్‌.సింగ్‌ నిర్మిస్తున్నారు. సోమవారం (ఫిబ్రవరి 24) జయలలిత 72వ జయంతి. ఈ సందర్భంగా ఈ సినిమాలోని కంగన కొత్త లుక్‌ను విడుదల చేశారు.

‘‘జయ లలితగారు ఎందరికో స్ఫూర్తి. వెండితెరపై ఆమె పాత్రను ఎంతో అంకితభావంతో పోషిస్తూ, ఆ పాత్రకు జీవాన్నిస్తున్నారు కంగనా. ఈ ప్రాజెక్ట్‌లో ఆమె భాగం కావడం ఈ సినిమా క్వాలీటిని ఎన్నో రెట్లు పెంచింది’’ అన్నారు విజయ్‌. ‘‘ఎన్నో అడ్డంకులతో పోరాడి, వాటిని అధిగమించి, ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి, దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఓ స్త్రీ గాథ ఈ చిత్రం’’ అన్నారు విష్ణువర్ధన్‌. ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ‘తలైవి’ 2020 జూన్ 26న విడుదల కానుంది. సంగీతం : జి.వి. ప్రకాష్ కుమార్, కెమెరా : విశాల్ విట్టల్, ఎడిటింగ్ : ఆంటోని, నిర్మాణం : విబ్రి మీడియా, కర్మ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌‌మెంట్.