Oscars95 : గత ఏడాది కంటే ఈ సంవత్సరం ఆస్కార్ చూసిన వారి సంఖ్య 12% పెరిగింది.. కారణం అదేనా?

ప్రపంచంలో ప్రతిష్టాత్మకంగా భావించే పురస్కారం ఆస్కార్. ఇక ఈ ఏడాది ఆస్కార్ బరిలో ఇండియన్ నుంచి మూడు సినిమాలు బరిలో నిలవగా.. వాటిలో RRR, The Elephant Whisperers చిత్రాలు ఆస్కార్ అందుకొని చరిత్ర సృష్టించాయి. కాగా ఈ ఏడాది ఆస్కార్ కార్యక్రమాన్ని చూసిన వారి సంఖ్య విపరీతంగా పెరిగిందట.

Oscars95 : గత ఏడాది కంటే ఈ సంవత్సరం ఆస్కార్ చూసిన వారి సంఖ్య 12% పెరిగింది.. కారణం అదేనా?

Oscars95 viewers rate is increased 12 percent on last last oscars

Oscars95 : ప్రపంచంలో ప్రతిష్టాత్మకంగా భావించే పురస్కారం ఆస్కార్. ప్రపంచంలోని సినిమా వారంతా ఈ అవార్డు అందుకోవడం జీవిత సాఫల్యంగా భావిస్తారు. ఇక ఈ ఏడాది ఆస్కార్ బరిలో ఇండియన్ నుంచి మూడు సినిమాలు బరిలో నిలవగా.. వాటిలో RRR, The Elephant Whisperers చిత్రాలు ఆస్కార్ అందుకొని చరిత్ర సృష్టించాయి. కాగా ఈ ఏడాది ఆస్కార్ కార్యక్రమాన్ని చూసిన వారి సంఖ్య విపరీతంగా పెరిగిందట. గత ఏడాదితో పోలిస్తే దాదాపు 12% ఆస్కార్ చూసిన వారి సంఖ్య పెరిగింది.

NTR – Charan : హాలీవుడ్ స్టార్స్‌ని వెనక్కి నెట్టి ముందు స్థానంలో నిలిచిన ఎన్టీఆర్, చరణ్..

2023 సంవత్సరానికి 15.36 మిలియన్ల మంది వీక్షిస్తే, ఈ ఏడాది 18.7 మిలియన్ల మంది ఆస్కార్ ని చూశారు. ఇక రేటింగ్ విషయంలో కూడా క్రిందటి సంవత్సరం కంటే 5% పెంచింది. లాస్ట్ ఇయర్ 3.2 రేటింగ్‌ వస్తే, ఈ ఏడాది 3.8 రేటింగ్‌ వచ్చింది. అయితే ఈసారి ఇంతలా రేటింగ్ అండ్ టిఆర్‌పి పెరగడానికి కారణం.. Avatar: The Way of Water, Everything Everywhere All at Once, Top Gun: Maverick సినిమాలు బరిలో ఉండడమే అని హాలీవుడ్ విశ్లేషకులు అభిప్రాయం పడుతున్నారు. అలాగే గత ఏడాది క్రిస్ రాక్‌ ని విల్ స్మిత్ చెంప దెబ్బ కొట్టడంతో, ఈ సంవత్సరం దాని గురించి ఏమన్నా మాట్లాడనున్నారా అనే అంశం కూడా ఆడియన్స్ ని ఆకర్షించినట్లు చెప్పుకొస్తున్నారు.

95th Oscar Winners : 95వ ఆస్కార్ అవార్డు గ్రహీతలు..

కాగా ఈ ఏడాది ఇండియన్ ఆడియన్స్ కూడా ఆస్కార్ చూసేందుకు ఎక్కువ ఆసక్తి చూపించారు. ప్రపంచం మొత్తాన్ని ఒక ఊపు ఊపేసిన నాటు నాటు సాంగ్ ఆస్కార్ బరిలో ఉండడం, ఆ పాటకి కచ్చితంగా ఆస్కార్ వస్తుందని హాలీవుడ్ మీడియా కూడా వార్తలు రాసుకు రావడంతో.. RRR ఆస్కార్ అందుకోవడం చూడాలనే ఆసక్తి అందరిలో మొదలైంది. దీంతో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటిటి ఈ కార్యక్రమాన్ని ఇండియాలో లైవ్ టెలికాస్ట్ చేసింది.