RRR : భారతీయులు గర్విస్తున్న క్షణాలివి.. RRR టీంకి పవన్ అభినందనలు!

అందరూ అనుకున్నట్లే నాటు నాటు సాంగ్ ఆస్కార్ గెలుచుకుంది. దీంతో RRR టీంని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు అభినందిస్తున్నారు. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..

RRR : భారతీయులు గర్విస్తున్న క్షణాలివి.. RRR టీంకి పవన్ అభినందనలు!

pawan kalyan congratulate rrr team for winning oscar award

RRR : ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల పురస్కారం ముగిసింది. ఈరోజు ఉదయం లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ లో 95వ ఆస్కార్ అవార్డు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఇక ఈ ఏడాది ఆస్కార్స్ కి భారతదేశం తరుపు నుంచి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ‘RRR’, డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’, బెస్ట్ డాక్యుమెంటరీ ఫ్యూచర్ ఫిల్మ్ కేటగిరీలో ‘అల్ దట్ బ్రీత్స్’ నామినేట్ అయ్యాయి. ఇక అందరు అనుకున్నట్లే నాటు నాటు సాంగ్ ఆస్కార్ అందుకుంది. దానితో పాటు ది ఎలిఫెంట్ విస్పరర్స్ కూడా ఆస్కార్ గెలుచుకుంది.

Oscars95 : ఆస్కార్‌ 2023లో ఎక్కువ అవార్డులు అందుకున్న సినిమా ఏదో తెలుసా?

ఇక RRR ఆస్కార్ అందుకోవడంతో సినీ, రాజకీయ ప్రముఖులు చిత్ర యూనిట్ కి అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా మూవీ టీంని అభినందిస్తూ ట్వీట్ చేశాడు. భారతీయులందరూ గర్వపడేలా ఆస్కార్ వేదికపై పురస్కారాన్ని స్వీకరించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర సంగీత దర్శకులు శ్రీ ఎం ఎం కీరవాణి గారికి, గీత రచయిత శ్రీ చంద్రబోస్ గారికి హృదయపూర్వక అభినందనలు. ఈ వార్తను చూడగానే ఎంతో సంతోషించాను. ఆస్కార్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా నిలిచిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో ‘నాటు నాటు’ గీతంలోని తెలుగు పదం.. నేల నలుచెరగులా ప్రతి ఒక్కరితో పదం కలిపేలా చేసి హుషారెత్తించింది.

Oscars 2023 Awards Full List : 95వ ఆస్కార్ అవార్డుల ఫుల్ లిస్ట్.. ఏ సినిమాకు ఏ అవార్డు వచ్చిందో తెలుసా?

ఆ హుషారు ఈ రోజు ఆస్కార్ వేదిక మీద రెట్టించిన ఉత్సాహంతో కనిపించింది. ఈ వేదికపై ఈ గీతాన్ని ప్రదర్శించడంతో పాటు అవార్డు పొందటం ద్వారా భారతీయ సినిమా స్థాయి మరో స్థాయికి చేరింది. ఇంతటి ఘనత పొందేలా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని రూపొందించిన దర్శకులు శ్రీ ఎస్ ఎస్ రాజమౌళి గారికి ప్రత్యేక అభినందనలు. ఆ చిత్రంలో కథానాయక పాత్రల్లో ఒదిగిపోయిన శ్రీ ఎన్ టి ఆర్, శ్రీ రాంచరణ్, గాయకులు శ్రీ రాహుల్ సిప్లిగంజ్, శ్రీ కాలభైరవ, నృత్య దర్శకులు శ్రీ ప్రేమ్ రక్షిత్, చిత్ర నిర్మాత శ్రీ డి వి వి దానయ్యలకు అభినందనలు. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి దక్కిన ప్రఖ్యాత ఆస్కార్ అవార్డుతోపాటు పలు అంతర్జాతీయ పురస్కారాలు భారతీయ దర్శకులు, నటులు, రచయితలకు స్ఫూర్తినిస్తుంది.