NV Prasad: ప్రభుత్వ నిర్ణయాలతో పవన్ కళ్యాణ్‌కి ఇబ్బంది లేదు.. నష్టపోతుంది మేమే! -ఎన్వీ ప్రసాద్

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల వ్యవహారం ఇంకా కొలిక్కిరాక ముందే భీమ్లా నాయక్ సినిమా థియేటర్లలోకి వచ్చేసింది.

NV Prasad: ప్రభుత్వ నిర్ణయాలతో పవన్ కళ్యాణ్‌కి ఇబ్బంది లేదు.. నష్టపోతుంది మేమే! -ఎన్వీ ప్రసాద్

Nv Prasad

NV Prasad: ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల వ్యవహారం ఇంకా కొలిక్కిరాక ముందే భీమ్లా నాయక్ సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. ఈ క్రమంలో అభిమానుల రచ్చ సాగుతుండగా.. ఇదే విషయమై ఏపీ ఫిల్మ్ ఛాంబర్ మాజీ అధ్యక్షుడు ఎన్వీ ప్రసాద్ మాట్లాడారు. థియేటర్ల వ్యవస్థ మీద దాడి కలిచివేస్తోందని అన్నారు.

తమిళనాడు నుంచి ఎంతో కష్టపడి ఇక్కడకు ఇండస్ట్రీని తీసుకొచ్చామని, థియేటర్ల వ్యవస్థ‌పై దాడి సరికాదని అన్నారు. ఎగ్జిబిటర్లు ప్రభుత్వ నిర్ణయాల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వానికి ఈ విషయాన్ని చాలా సార్లు చెప్పినట్లు చెప్పారు. మంత్రి నానిని కలిసి మా బాధలు చిప్పినా పరిష్కారం లభించట్లేదని అన్నారు.

కరోనా నుంచి రికవరీ అవుతున్న సమయంలో ఇలా దాడి చేస్తుండడం సరికాదని అన్నారు. ఈ ప్రభుత్వం థియేటర్ల వ్యవస్థ పై దాడి చేస్తోందని అన్నారు. ఎగ్జిబిటర్లు మరో వ్యాపారం చూసుకోవాల్సి వస్తోందని అన్నారు. ఇది పవన్ కళ్యాణ్ పై దాడి కాదని, వ్యవస్థపై దాడిలా ఉందని అన్నారు. ఇది సరైన పద్దతి కాదన్నారు.

అధికారులను థియేటర్లకు పంపి ఇబ్బందులు పెడుతూ.. మమ్మల్ని ఏమి చేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్‌కి మీకు ఏమైనా ఉంటే మీరు తేల్చుకోండి.. అంతేకాని, మాపై ఎందుకు ఇలా అని ప్రశ్నించారు. మమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంది కాదా? అని నిలదీశారు. ప్రభుత్వ నిర్ణయాల వల్ల పవన్ కళ్యాణ్‌కు ఎలాంటి ఇబ్బంది లేదని, దీని వల్ల ఇబ్బంది పడుతుంది ఎగ్జిబిటర్లేనని అన్నారు.