Pawan Kalyan: ఆ డైరెక్టర్‌తో సినిమా ఉందంటున్న పవన్.. కానీ ఎప్పుడో?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆయన నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా తరువాత పవన్ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్‌సింగ్’ సినిమాను తెరకెక్కించనున్నాడు. ఈ రెండు సినిమాలపై ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు ఏర్పడ్డాయి.

Pawan Kalyan: ఆ డైరెక్టర్‌తో సినిమా ఉందంటున్న పవన్.. కానీ ఎప్పుడో?

Pawan Kalyan Surender Reddy Movie On The Cards

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆయన నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా తరువాత పవన్ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్‌సింగ్’ సినిమాను తెరకెక్కించనున్నాడు. ఈ రెండు సినిమాలపై ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు ఏర్పడ్డాయి.

Pawan Kalyan Fans : పవన్ ఫ్యాన్స్ వీరంగం: లీలామహల్ థియేటర్ వద్ద ఫ్యాన్స్ హడావిడి

అయితే ఈ రెండు సినిమాలతో పాటు పవన్ మరో సినిమాను కూడా గతంలో అనౌన్స్ చేశాడు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ ఓ సినిమా చేయబోతున్నట్లు తెలిపారు. అయితే ఈ సినిమాను అనౌన్స్ చేసిన తరువాత ఇప్పటివరకు ఈ సినిమా ఊసే లేదు. అయితే పవన్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉంటుండటంతో, సురేందర్ రెడ్డి సినిమా ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. అయితే గతకొద్ది రోజులగా ఈ సినిమా అటకెక్కినట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి.

Pawan Kalyan : హరిహర వీరమల్లు సినిమా నుంచి.. పవర్ ప్యాక్డ్ పవర్ గ్లాన్స్.. పాన్ ఇండియా దద్దరిల్లాల్సిందే..

కాగా, తాజాగా ఈ చిత్ర నిర్మాత రామ్ తాళ్లూరి ఈ సినిమాపై కామెంట్ చేశారు. ఈ సినిమా ఖచ్చితంగా ఉంటుందని, అయితే తాము ప్రస్తుతం తెరకెక్కిస్తున్న ఏజెంట్ సినిమా తరువాత పవన్‌తో సినిమా చేయబోతున్నట్లు రామ్ తాళ్లూరి తెలపడంతో పవన్ అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా చూస్తున్నారు. కానీ ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో, ఎప్పటికి రిలీజ్ అవుతుందో అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు.