Payal Rajput: సినిమాల్లోకి రాకపోతే పాయల్ ఏం చేసేదో తెలుసా?

‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్, ఆ సినిమాతో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. అందాల ఆరబోతకు ఎలాంటి హద్దులు లేవంటూ ఈ బ్యూటీ చేసిన రచ్చ మామూలుది కాదు. అయితే పాయల్ సినిమాల్లోకి రాకపోతే ఏం చేసేదనే ప్రశ్నకు అమ్మడు సమాధానం ఇచ్చింది.

Payal Rajput: సినిమాల్లోకి రాకపోతే పాయల్ ఏం చేసేదో తెలుసా?

Payal Rajput: ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్, ఆ సినిమాతో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. అందాల ఆరబోతకు ఎలాంటి హద్దులు లేవంటూ ఈ బ్యూటీ చేసిన రచ్చ మామూలుది కాదు. ఇక ఆ సినిమా తరువాత తన నెక్ట్స్ చిత్రాల ఎంపికలో తడబడుతూ తన కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తోంది ఈ బ్యూటీ. అయితే తాజాగా అమ్మడు ఆది సాయికుమార్ సరసన ‘తీస్ మార్ ఖాన్’ అనే సినిమాలో నటిస్తోంది.

Payal Rajput: బోల్డ్ అంటే ఇదే.. స్టేజ్‌పైనే లిప్‌లాక్ ఇచ్చేసిన పాయల్!

ఈ సినిమా ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్‌లో భాగంగా అమ్మడు పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంది. ఈ క్రమంలోనే తన మనసులోని మాటలను ప్రేక్షకులతో పంచుకుంది. అమ్మడికి ఈ సినిమాలో మంచి పాత్ర దొరికిందని.. ఆర్ఎక్స్ 100 తరువాత మళ్లీ పర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్ర ఈ సినిమాలో దొరికినందుకు తనకు చాలా సంతోషంగా ఉందని పాయల్ తెలిపింది.

Payal Rajput: అమ్మబాబోయ్.. పాయల్ అందాలు చూశారా..?

అయితే ఈ క్రమంలో పాయల్ సినిమాల్లోకి రాకపోతే ఏం చేసేదనే ప్రశ్నకు అమ్మడు సమాధానం ఇచ్చింది. తాను జర్నలిజం చేశానని.. ఒకవేళ సినిమాల్లో హీరోయిన్‌గా మారకపోతే, తాను ఖచ్చితంగా న్యూస్ యాంకర్‌గా మారేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది. అందాల ఆరబోతతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోన్న పాయల్, జర్నలిజం చేసిందనే విషయం చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఇలా అమ్మడు తన బ్యాక్‌గ్రౌండ్ గురించి చెప్పడంతో, ఒకవేళ ఆమె న్యూస్ యాంకర్‌గా ఉంటే ఎలా ఉండేదని అభిమానులు ఊహించుకుంటున్నారు. ఏదేమైనా పాయల్ హీరోయిన్‌గా ఉండటమే తమకు కావాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు.