రిలీజ్ కు ముందే రగడ : ”అల వైకుంఠపురములో” సినిమాపై కేసు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన సినిమా అల.. వైకుంఠపురములో.. రిలీజ్ కు ముందే ఈ సినిమా కాంట్రవర్సీలో చిక్కుకుంది. ఈ చిత్రం నిర్మాణ సంస్థపై జూబ్లీహిల్స్ పోలీసులు

  • Published By: veegamteam ,Published On : January 9, 2020 / 05:50 AM IST
రిలీజ్ కు ముందే రగడ : ”అల వైకుంఠపురములో” సినిమాపై కేసు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన సినిమా అల.. వైకుంఠపురములో.. రిలీజ్ కు ముందే ఈ సినిమా కాంట్రవర్సీలో చిక్కుకుంది. ఈ చిత్రం నిర్మాణ సంస్థపై జూబ్లీహిల్స్ పోలీసులు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన సినిమా అల.. వైకుంఠపురములో.. రిలీజ్ కు ముందే ఈ సినిమా కాంట్రవర్సీలో చిక్కుకుంది. ఈ చిత్రం నిర్మాణ సంస్థపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిబంధనలను బ్రేక్ చేశారని జూబ్లీహిల్స్ ఎస్ఐ నవీన్ రెడ్డి ఫిర్యాదుతో కేసు బుక్ చేశారు. వివరాల్లోకి వెళితే.. జనవరి 6న యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో అల..వైకుంఠపురము చిత్ర యూనిట్ మ్యూజికల్ నైట్ నిర్వహించింది. ఇది చాలా గ్రాండ్ గా జరిగింది. సక్సెస్ కూడా అయ్యింది. దీంతో చిత్ర యూనిట్ ఫుల్ జోష్ మీదుంది.

అయితే మ్యూజికల్ నైట్ కార్యక్రమంలో రూల్స్ బ్రేక్ చేశారని జూబ్లీహిల్స్ ఎస్ఐ నవీన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. మ్యూజికల్ నైట్ కు రాత్రి 10 గంటల వరకే పర్మిషన్ ఉంది. అయితే రాత్రి 11.30 గంటల వరకు మ్యూజికల్ నైట్ నడిచింది. అలాగే ఈ కార్యక్రమానికి 6వేల మంది మాత్రమే పిలవాల్సి ఉండగా.. 15వేల మందిని ఇన్వైట్ చేశారని ఎస్ఐ నవీన్ తన ఫిర్యాదులో తెలిపారు. తమకు తప్పుడు సమాచారం ఇచ్చారని చెప్పారు. దీంతో శ్రేయాస్ మీడియా ఎండీ, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మేనేజర్ పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.

మ్యూజికల్ నైట్ కోసం నిర్మాణ సంస్థ జనవరి 2న పోలీసుల పర్మిషన్ తీసుకుంది. 5 నుంచి 6వేల మంది వరకు ఫ్యాన్స్ హాజరవుతారని.. రాత్రి 10గంటలలోగా కార్యక్రమం ముగిస్తామని పోలీసులకు ఇచ్చిన లేఖలో నిర్మాణ సంస్థ తెలిపింది. అయితే… ఇందుకు విరుద్ధంగా కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ఏకంగా 15వేల మంది వచ్చారు. 11.30గంటల వరకు ఈవెంట్ నడిచింది. దీంతో పోలీసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ జామ్ తో ప్రజలు అసౌకర్యానికి గురయ్యారు. దీన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. అనుమతులకు విరుద్ధంగా ఈవెంట్ నిర్వహించారని, ప్రజలకు అసౌకర్యం, పోలీసులకు ఇబ్బందులు కలిగించారని.. కేసు నమోదు చేశారు.

త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కింది. సంక్రాంతి పండగ కానుకగా జనవరి 12న ఈ మూవీ రిలీజ్ కానుంది. మూవీ ప్రమోషన్ లో భాగంగా మ్యూజికల్ నైట్ నిర్వహించారు. ఎంతో గ్రాండ్ గా మ్యూజికల్ నైట్ సాగింది. ఇందులో అల్లు అర్జున్ ఎమోషన్ అయ్యారు. తన తండ్రి అల్లు అర్జున్ ని తలుచుకుని కంటతడి పెట్టారు. మా నాన్నకు పద్మశ్రీ ఇవ్వాలని కోరారు. నాకు చిరంజీవి అంటే ప్రాణం… కట్టె కాలే వరకూ ఆయన అభిమానినే అని చెప్పారు. చిరంజీవి తర్వాత నేను చాలా అభిమానించేది సూపర్ స్టార్ రజనీకాంత్ గారిని.. రజనీ సార్ నాకొక రోల్ మోడల్.. ఇన్సిపిరేషన్.. అన్నారు. 

* అల..వైకుంఠపురములో.. సినిమా నిర్మాణ సంస్థపై పోలీస్ కేసు
* మ్యూజికల్ నైట్ నిబంధనలకు విరుద్దంగా జరిగిందని కేసు
* ట్రాఫిక్ సమస్య సైతం ఏర్పడంతో ఫిర్యాదు చేసిన జూబ్లీహిల్స్ ఎస్ఐ నవీన్ రెడ్డి
* మ్యూజికల్ నైట్ కార్యక్రమానికి 6వేల మందికిగానూ 15వేల మందిని ఆహ్వానించిన సినిమా నిర్మాణ సంస్థ
* రాత్రి 10గంటలకు ముగియాల్సిన కార్యక్రమం.. రాత్రి 11.30 గంటల వరకు కొనసాగించారని కేసు నమోదు
* శ్రేయాస్ మీడియా ఎండీ, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మేనేజర్ పై కేసు నమోదు

Also Read : కట్టె కాలే వరకు ఆయన అభిమానినే : మరోసారి పవన్ ఫ్యాన్స్ ను హర్ట్ చేసిన బన్నీ