సాయి ధరమ్ తేజ్ హీరోగా ‘సోలో బ్రతుకే సో బెటర్’

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్.. నభా నటేష్ జంటగా.. సుబ్బుని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. BVSN ప్రసాద్ నిర్మిస్తున్న‘సోలో బ్రతుకే సో బెటర్’ ప్రారంభం..

10TV Telugu News

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్.. నభా నటేష్ జంటగా.. సుబ్బుని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. BVSN ప్రసాద్ నిర్మిస్తున్న‘సోలో బ్రతుకే సో బెటర్’ ప్రారంభం..

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్.. ‘సోలో బ్రతుకే సో బెటర్’ అంటున్నాడు. ఇప్పుడు తేజ్ హీరోగా నటించనున్న కొత్త సినిమా ప్రారంభమైంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర LLP బ్యానర్‌పై BVSN ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘సోలో బ్రతుకే సో బెటర్’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ, టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు.

సుబ్బు దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. నభా నటేష్ ఫస్ట్ టైమ్ తేజుతో నటిస్తుంది. నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగనుంది. థమన్ మ్యూజిక్, వెంకట్ సి దిలీప్ ఫోటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనింగ్ అందించనున్నారు.

Read Also : ‘వెంకీమామ’ దసరా శుభాకాంక్షలు..

నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియనున్నాయి.. తేజు, మారుతి దర్శకత్వంలో చేస్తున్న ‘ప్రతిరోజూ పండగే’ షూటింగ్ దశలో ఉంది. యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తుంది.