Pooja Hegde : పూజా హెగ్డే పార్టీ స్టైలే వేరు..!
జనరల్‌గా పార్టీ అంటే ఫ్రెండ్స్‌తో పబ్బుల్లో డ్యాన్సులు, ఆటపాటలతో ఫుల్ జోష్‌తో చేసుకుంటారు.. కానీ పూజా హెగ్డే పార్టీ ఎలా చేసుకుంటుందో తెలుసా..?
Pooja Hegde: ప్రజెంట్ హీరోయిన్స్‌లో పూజా హెగ్డే స్టైలే వేరు. కంపోజ్డ్గా కెరీర్‌ని బిల్డప్ చేసుకుంటున్నఈ క్యూట్ బ్యూటీ.. ఎంత మోడర్న్‌గా ఉంటుందో అంత సింపుల్ లైఫ్‌ని లీడ్ చేస్తుంది. జనరల్‌గా పార్టీ అంటే ఫ్రెండ్స్‌తో పబ్బుల్లో డ్యాన్సులు, ఆటపాటలతో ఫుల్ జోష్‌తో చేసుకుంటారు. కానీ పూజా హెగ్డే పార్టీ ఎలా చేసుకుంటుందో తెలుసా..?
మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డే.. బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్‌తో తెలుగు, తమిళ్, హిందీల్లో ఫుల్ బిజీ అయిపోయింది. మాంచి రెమ్యూనరేషన్‌తో ఫైనాన్షియల్‌గా కూడా బాగానే సెటిల్ అవుతోంది. ఇంకేముంది.. నాలుగు డబ్బులొచ్చాయి, సెలబ్రిటీ స్టేటస్ వచ్చిందంటే ఇక ఫుల్‌గా పార్టీలు, పబ్బులు, డ్యాన్సులు అంటూ ఎక్కడపడితే అక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు స్టార్లు. కానీ పూజా హెగ్డే పార్టీ స్టైల్ మాత్రం డిఫరెంట్ అంటోంది.
View this post on Instagram
హ్యాపీగా ఇంట్లో బిందాస్‌గా కూర్చుని ఇష్టమైన ఫుడ్ తింటూ కంఫర్టబుల్‌గా ఉంటే.. అదే నాకు పార్టీ అంత హ్యాపినెస్ ఇస్తుంది. అదే నాకు పెద్ద పార్టీ చేసుకున్నంత హాయిగా ఉంటుంది. అలాగే నేను ఎంజాయ్ చేస్తానంటోంది పూజా. అందరిలా పార్టీ అంటే ఎక్కడికో బయటికెళ్లి చేసుకుంటేనే పార్టీ కాదు.. సో.. ‘ఐయామ్ నాట్ ఎ పార్టీ గర్ల్’ అంటూ సింపుల్ డ్రెస్‌తో గ్లాసెస్ పెట్టుకున్న ఫోటో పెట్టి మరీ సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చింది ముద్దుగుమ్మ.
తెలుగులో స్టార్ హీరోలందరి సరసన హీరోయిన్గా చేస్తున్న పూజా.. కెరీర్‌ని చాలా తెలివిగా డిజైన్ చేసుకుంటోంది. ఏదో వచ్చిన ప్రతి అవకాశానికీ ఓకే చెప్పకుండా ఆచితూచి అడుగులేస్తోంది. కెరీర్ సో..సో గా సింపుల్‌గా క్యారీ అయితే ఏం బావుంటుంది.. ఎక్స్పెరిమెంట్లు చేసినప్పుడే లైఫ్‌లో మజా వస్తుందన్న పాలసీకి ఓకే చెప్పే పూజా.. అటు తెలుగు, తమిళ్, హిందీలో వరుసగా సినిమాలు చేస్తోంది.