Pooja Hegde: ‘జనగణమన’లో పూజా రెమ్యునరేషన్.. అమ్మడి కెరీర్‌లో ఇదే హయ్యెస్ట్!

అందాల భామ పూజా హెగ్డే ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇప్పటికే ఈ బ్యూటీ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తుండగా అమ్మడు స్పెషల్ సాంగ్స్‌లోనూ చిందులేస్తూ....

Pooja Hegde: ‘జనగణమన’లో పూజా రెమ్యునరేషన్.. అమ్మడి కెరీర్‌లో ఇదే హయ్యెస్ట్!

Pooja Hegde Stunning Remuneration For Janaganamana

Pooja Hegde: అందాల భామ పూజా హెగ్డే ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇప్పటికే ఈ బ్యూటీ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తుండగా అమ్మడు స్పెషల్ సాంగ్స్‌లోనూ చిందులేస్తూ కనిపిస్తోంది. ఇటీవల ఎఫ్3 సినిమాలో పూజా స్పెషల్ సాంగ్‌కు అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. అయితే ఈ సాంగ్ కోసం అమ్మడు కళ్లుచెదిరే రెమ్యునరేషన్ తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇదే జోరును తన సినిమాల్లోనూ కంటిన్యూ చేస్తూ దూసుకుపోతుంది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘జనగణమన’ చిత్రాన్ని దర్శకుడు పూరీ జగన్నాధ్ డైరెక్ట్ చేస్తుండగా, ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తున్న సంగతి తెలిసిందే.

Pooja Hegde : బుట్టబొమ్మ డేట్స్ దొరకాలంటే కష్టమే..

ఈ సినిమా షూటింగ్‌ను ఇటీవల ప్రారంభించగా, ఇందులో పూజా హెగ్డే కూడా జాయిన్ అయ్యింది. ఇక ఈ సినిమా కోసం పూజా ఎంతమేర రెమ్యునరేషన్ పుచ్చుకుంటుందా అనేది ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ‘జనగణమన’ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా దర్శకుడు పూరీ తెరకెక్కిస్తుండటంతో, ఈ సినిమాలో పూజా హెగ్డే భారీగా రెమ్యునరేషన్ అందుకుంటుందట. ఈ సినిమాను హిందీ, తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిస్తుండగా, ఇప్పటికే పూజా హెగ్డేకు సంబంధించిన సీన్స్‌‌ను షూట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం పూజా హెగ్డే ఏకంగా రూ.5 కోట్ల మేర రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

Pooja Hegde: జనగణమణ షూటింగ్ స్టార్ట్.. బుట్టబొమ్మతో మొదలుపెట్టన పూరీ

ఇంతటి భారీ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకోవడం పూజా కెరీర్‌లో ఇదే తొలిసారి అని తెలుస్తోంది. ఈ సినిమాతో మరోసారి పాన్ ఇండియా స్థాయిలో అదిరిపోయే గుర్తింపును తెచ్చుకోవాలని పూజా చూస్తోంది. ఇక జనగణమన చిత్రాన్ని ఆర్మీ నేపథ్యంలో తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాలో పూజా పాత్ర ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఈ సినిమాలో పూజా కూడా కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లు చేయబోతుందని.. దానికి సంబంధించి ట్రెయినింగ్ కూడా అమ్మడు తీసుకుంటున్నట్లుగా చిత్ర వర్గాలు చెబుతున్నాయి.