Poonam Kaur : నేను తెలంగాణ బిడ్డనే.. పూనమ్ కౌర్ కంటతడి..

హీరోయిన్ పూనమ్ కౌర్ పేరు సినిమా వార్తల్లో కంటే ఇతర విషయాల్లో ఎక్కువ వినిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తున్న ఈ భామ వైరల్ కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రేండింగ్ లో ఉంటుంది. కాగా..

Poonam Kaur : నేను తెలంగాణ బిడ్డనే.. పూనమ్ కౌర్ కంటతడి..

Poonam Kaur

Poonam Kaur : హీరోయిన్ పూనమ్ కౌర్ పేరు సినిమా వార్తల్లో కంటే ఇతర విషయాల్లో ఎక్కువ వినిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తున్న ఈ భామ వైరల్ కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రేండింగ్ లో ఉంటుంది. కాగా పూనమ్ ఒక పంజాబీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న అమ్మాయి.. కానీ ఆమె పుట్టింది, పెరిగింది అంతా హైదరాబాద్ లోనే. తాజాగా హైదరాబాద్ రాజ్ భవన్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పూనమ్ కూడా హాజరయ్యింది.

Oscars 2023 : ఆస్కార్ అందుకున్న భారతీయులు ఎవరో తెలుసా?

ఈ కార్యక్రమంలో పూనమ్ కౌర్ మాట్లాడుతూ కన్నీరు పెట్టుకొని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యింది. ”నేను తెలంగాణలోనే పుట్టాను. కానీ నన్ను తెలంగాణ నుంచి వేరు చేస్తున్నారు. నా మతం పేరు చెప్పి నన్ను తెలంగాణ నుంచి విడదీస్తున్నారు. నేను పంజాబీ అమ్మాయి కావొచ్చు.. కానీ పుట్టింది ఇక్కడే, పెరిగింది ఇక్కడే. నా మతం నన్ను నా రాష్ట్రము నుంచి విడదియ్యలేదు. నేను తెలంగాణ బిడ్డనే, కాబట్టి నన్ను వెలివేయకండి” అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.

NTR30: ఆ సూపర్ హిట్ పాటను రీమిక్స్ చేస్తున్న తారక్-జాన్వీ..?

కాగా పూనమ్ కౌర్ ‘మాయాజాలం’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత కూడా కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఈ భామ.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తుంది. అలాగే రాజకీయ పరంగా కూడా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటుంది. ఇక ఇటీవల తను కూడా సమంతలా అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలియజేసింది. ఫైబ్రోమయాల్జియా అనే వ్యాధి భారిన పడినట్లు, గత రెండేళ్లగా చికిత్స తీసుకుంటున్నట్లు కూడా వెల్లడించింది.