Oscars 2023 : ఆస్కార్ అందుకున్న భారతీయులు ఎవరో తెలుసా?

వరల్డ్ వైడ్ గా ఉన్న సినిమా టెక్నీషియన్స్ అందరికి ఆస్కార్ గెలవాలన్న కోరిక ఉంటుంది. ఇంత ప్రతిష్టాత్మకంగా భావించే ఈ అవార్డ్స్ ని ఇప్పటి వరకు ఎంతమంది ఇండియన్ టెక్నీషియన్స్ గెలుచుకున్నారో తెలుసా? వారు ఎవరు? ఏ సినిమాకు గాను, ఏ సంవత్సరంలో ఆస్కార్ అందుకున్నారో తెలుసు కోవాలని ఉందా? అయితే ఈ ఆర్టికల్ వైపు ఒక లుక్ వేసేయండి.

Oscars 2023 : ఆస్కార్ అందుకున్న భారతీయులు ఎవరో తెలుసా?

oscar 2023

Oscars 2023 : వరల్డ్ వైడ్ గా ఉన్న సినిమా టెక్నీషియన్స్ అందరికి ఆస్కార్ గెలవాలన్న కోరిక ఉంటుంది. కనీసం ఒక్కసారి అయిన నామినేషన్స్ లో చోటు దక్కించుకున్న చాలు అనుకుంటారు. ఇంత ప్రతిష్టాత్మకంగా భావించే ఈ అవార్డ్స్ ని ఇప్పటి వరకు ఎంతమంది ఇండియన్ టెక్నీషియన్స్ గెలుచుకున్నారో తెలుసా? వారు ఎవరు? ఏ సినిమాకు గాను, ఏ సంవత్సరంలో ఆస్కార్ అందుకున్నారో తెలుసు కోవాలని ఉందా? అయితే ఈ ఆర్టికల్ వైపు ఒక లుక్ వేసేయండి.

Oscars 2023 : ఆస్కార్ అవార్డుల వేడుక ఓటిటిలో కూడా లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు..

ఇప్పటి వరకు 6 భారతీయులు ఈ అవార్డుని అందుకున్నారు. మొదటిసారి 1983లో భారత టెక్నీషియన్ కి ఆస్కార్ వరించింది. జాతిపిత మహాత్మా గాంధీ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఇంగ్లీష్ మూవీ ‘గాంధీ’ సినిమాకు ఇంగ్లాండ్ కాస్ట్యూమ్ డిజైనర్ ‘జాన్ మెళ్లో’తో పాటు ఇండియాకి చెందిన ‘భాను అతైయా’ కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేశారు. 55వ ఆస్కార్ అవార్డుల్లో బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ గా గాంధీ సినిమాకు గాను జాన్ మెళ్లో, భాను అతైయా కలిసి ఈ ఆస్కార్ ని అందుకున్నారు. ఆస్కార్ అందుకున్న తొలి భారతీయురాలుగా భాను చరిత్ర సృష్టించారు.

ఆ తరువాత మళ్ళీ 1992లో ఆస్కార్ అవార్డు ఇండియన్ ని వరించింది. భారతీయ సినీ చరిత్రలో ఒక సంచలనం.. దర్శకుడు ‘సత్యజిత్ రే’. ఈయన మొత్తం కెరీర్ లో ఫీచర్ ఫిలిమ్స్, డాక్యుమెంటరీ, షార్ట్ ఫిలిమ్స్ కలిపి 36 చిత్రాలు తెరకెక్కించారు. దాదాపు ప్రతి సినిమా నేషనల్ లేదా ఇంటర్నేషనల్ అవార్డ్స్ లో నిలవడం లేదా అవార్డు గెలుచుకొని చరిత్ర సృష్టించాయి. ఒక దర్శకుడి గానే కాదు స్క్రీన్ ప్లే రచయితగా, కథా రచయితగా, సంగీత దర్శకుడిగా, ఎడిటర్‌గా, సినిమాటోగ్రాఫర్‌గా, వ్యాసాలు మరియు నవలలు రాసిన సాహిత్యకారుడిగా.. ఇలా కళారంగానికి ఎంతో సేవలు అందించాడు. ఆయన సేవలను గుర్తించి భారతీయ ప్రభుత్వం ఎన్నో అవార్డులతో పురస్కరించగా, అకాడమీ కూడా తన 62వ అవార్డుల పురస్కారంలో హానరరీ అవార్డుతో గౌరవించింది. అనారోగ్యం కారణంగా అవార్డు అందుకోడానికి సత్యజిత్ వెళ్లలేకపోవడంతో.. కోల్‌కత్తా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సత్యజిత్ కి అవార్డుని తీసుకు వచ్చి ఇచ్చారు. ఈ అవార్డుని అందుకున్న ఏకైక భారతీయుడిగా సత్యజిత్ నిలిచారు.

దీని తరువాత ఆస్కార్ అందుకోడానికి ఆల్మోస్ట్ 17 ఏళ్ళు పట్టింది. అయితే ఆ గ్యాప్ ని ఒకేసారి 3 అవార్డులు అందుకొని పూరించారు మన భారతీయ టెక్నీషియన్స్. ఇంగ్లీష్ సినిమాగా తెరకెక్కిన ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ సినిమాకు భారతీయులు అయిన రెసుల్ పూక్కుట్టి, గుల్జార్, ఎ ఆర్ రెహమాన్ ఆస్కార్ అందుకున్నారు. బెస్ట్ సౌండ్ మిక్సింగ్ కేటగిరీలో రెసుల్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో జయహో సాంగ్ కు గాను గుల్జార్, ఎ ఆర్ రెహమాన్ ఆస్కార్ అందుకున్నారు.

ఇక చివరిగా 2019లో బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం కేటగిరీలో ఇండియాకి ఆస్కార్ దక్కింది. న్యూఢిల్లీకి చెందిన గునీత్ మోంగా.. ‘పీరియడ్ – ఎండ్ అఫ్ సెంటెన్స్’ అనే డాక్యుమెంటరీ షార్ట్ ఫిలింకి అవార్డుని అందుకున్నారు. ఇప్పటివరకు ఆస్కార్ అందుకున్న భారతీయులు వేరే. కాగా ఈ ఏడాది ఆస్కార్ బరిలో RRR – ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో, అల్ దట్ బ్రీత్స్ – బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ కేటగిరీలో, ది ఎలిఫెంట్ విస్ఫర్స్ – బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం కేటగిరీలో నామినేషన్స్ లో నిలిచాయి. మరి వీటిలో ఏది అవార్డు అందుకొని ఇండియాకి మరో ఆస్కార్ ని తీసుకు వస్తుందో తెలియాలి అంటే మార్చి 12 వరకు ఎదురు చూడాల్సిందే.