‘‘ఆదిపురుష్’’.. రాముడిగా ప్రభాస్, సీత పాత్రలో అనుష్క!..

  • Published By: sekhar ,Published On : August 21, 2020 / 05:22 PM IST
‘‘ఆదిపురుష్’’.. రాముడిగా ప్రభాస్, సీత పాత్రలో అనుష్క!..

టాలీవుడ్ రెబల్ స్టార్, ‘బాహుబలి’ చిత్రాలతో ప్యాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. డార్లింగ్ డైరెక్ట్ హిందీ మూవీగా ‘ఆదిపురుష్’ అనే భారీ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. టీ సిరీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. హిందీ, తెలుగు భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో అనువాదం చేయనున్నారు. ఈ చిత్రాన్ని త్రీడీలో రూపొదించనుండటం విశేషం. భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నపౌరాణిక చిత్రమిది. రామాయణాన్నే ‘ఆదిపురుష్’ పేరుతో తెరకెక్కిస్తారని వార్తలు వినిపస్తున్నాయి. ఈ విషయాన్ని పోస్టర్ ద్వారానే యూనిట్ అనౌన్స్ చేసింది.



పోస్టర్లో రాముడు, రావణాసురుడు, హనుమంతుడు పాత్రలను ఎలివేట్ చేయడం ద్వారా సినిమా జోనర్ రివీల్ చేశారు. సినిమాలో ప్రభాస్ హీరో కాబట్టి రాముడిగా కనిపిస్తారు. అయితే ప్రభాస్ రాముడి గెటప్పులో ఎలా ఉంటాడు?.. అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. రామావతార్‌లో ప్రభాస్ ఇలా ఉంటాడు అంటూ ఓ అభిమాని ప్రభాస్‌ను రాముడిగా మార్చి డిజైన్ చేసిన ఓ పోస్టర్ ఇటీవల వైరల్ అయింది.



అయితే రాముడి పక్కన సీతగా వీళ్లు నటిస్తున్నారంటూ కొంతమంది కథానాయికల పేర్లు వినిపిస్తున్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం సీత పాత్రకు అనుష్క అయితే యాప్ట్ అంటున్నారు. ఓ అభిమాని రాముడిగా ప్రభాస్, సీతగా అనుష్క ఎలా ఉంటారో ఓ పోస్టర్ డిజైన్ చేశాడు. వేరే ఆర్టిస్టుల ప్లేసులో ప్రభాస్, అనుష్క ఫొటోలు మార్ఫింగ్ చేశారని తెలిసిపోతుంది.. అయినా రాముడు, సీతగా ప్రభాస్, అనుష్క పెయిర్ బాగుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. దీంతో ఈ పిక్ వైరల్ అవుతోంది.