నెవర్ బిఫోర్ రికార్డ్ క్రియేట్ చేసిన ప్రభాస్

  • Published By: madhu ,Published On : June 8, 2020 / 05:24 AM IST
నెవర్ బిఫోర్ రికార్డ్ క్రియేట్ చేసిన ప్రభాస్

ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా లేదా అన్నాడు మహేష్ బాబు . రావడం లేట్ అవుతుందేమో కానీ .. రావడం మాత్రం పక్కా అన్నాడు పవన్ కళ్యాణ్. ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మాత్రం ..నేనొచ్చాక లెక్కలు రికార్డులు మారాల్సిందే  అంటున్నాడు. సోషల్ మీడియాలో సరికొత్త రికార్డ్ తో హిస్టరీ క్రియేట్ చేశాడు రెబల్ స్టార్.

సోషల్ మీడియాలో నెవర్ బిఫోర్ రికార్డ్ క్రియేట్ చేశాడు ప్రభాస్. మరి ప్యాన్ ఇండియా స్టారా మజాకానా..? ఆ మాత్రం ఫాలోయింగ్ ఉండాల్సిందే మరి అంటున్నారు ఫ్యాన్స్ . ట్విట్టర్, ఇన్ స్టా లాంటి యాప్స్ దూసుకెళుతున్నా కూడా ప్రభాస్ కి ఫేస్ బుక్ ఫాలోవర్స్ ఓ రేంజ్ లో ఉన్నారు. లేటెస్ట్ గా ప్రభాస్ ఫేస్ బుక్ పేజ్ కోటి 40 లక్షల ఫాలోవర్స్ ని క్రాస్ చేసి సౌత్ ఇండియాలో రికార్డ్ క్రియేట్ చేసింది.  

బాహుబలి సినిమాతో ఒక్కసారిగా ప్యాన్ ఇండియా లెవల్లోనే కాకుండా వరల్డ్ వైడ్ గా క్రేజ్ సంపాదించుకున్నాడు ప్రభాస్. ఆ దెబ్బతో ఫాలోవర్లు, ఫ్యాన్స్ విపరీతంగా పెరిగిపోయారు ప్రభాస్‌కి. స్టార్ సెలబ్రిటీల దగ్గర నుంచి సామాన్యుల వరకూ రెబల్ స్టార్ ని ఇష్టపడే వాళ్ల లిస్ట్ పెద్దదే. మిగతా హీరోల్లాగా సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా కూడా ఉండరు ప్రభాస్. అయినా సరే అందరినీ వెనక్కు నెట్టి కోటి 40 లక్షల మంది ఫాలోవర్స్ తో టాప్ లో ఉన్నాడు ప్రభాస్. 

ప్రభాస్ తర్వాత సౌత్ లో అంత క్రేజ్ ఉన్న హీరో అల్లు అర్జున్. బన్నీ.. కోటి 30 లక్షలకు పైగా ఫాలోవర్స్ తో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. ఎందుకంటే బన్నీకి కూడా సౌత్ లాంగ్వేజెస్ అన్నిటితో పాటు బాలీవుడ్ లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బన్నీ హిందీ డబ్బింగ్ మూవీస్ నార్త్ లో మంచి హిట్ అయ్యాయి.

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంకా కోటి మందిని రీచ్ కాలేదు. సోషల్ మీడియాలో తన పర్సనల్ తో పాటు ప్రొఫెషనల్ అప్ డేట్స్ కూడా ఎప్పటికప్పుడు పెట్టే మహేష్ బాబు ఇప్పుడే 80 లక్షల ఫాలోవర్స్ ని రీచ్ అవుతున్నారు.మహేష్ తర్వాత రామ్ చరణ్ 71 లక్షల మంది ఫాలోవర్స్ తో ఫోర్త్ ప్లేస్ లో ఉన్నారు. ఇప్పుడిప్పుడే రామ్ చరణ్ కూడా ప్యాన్ ఇండియా లెవల్ కి వెళుతున్నారు కాబట్టి.. ఫాలోవర్స్ కూడా గట్టిగానే పెరుగుతున్నారు.వీళ్ల తర్వాత నెక్ట్స్ ప్లేస్ నానిదే. నాని సినిమాలు అన్ని జానర్స్ కి నచ్చడంతో నాని ఫాలోయింగ్ కూడా ఫేస్ బుక్ లో  52 లక్షల ఫాలోవర్స్ ని క్రాస్ చేసింది.

Read: శింబు మ్యారేజ్ పై తండ్రి రాజేంద్రర్ ఏం చెప్పారంటే..??