Salaar: రాధేశ్యామ్, సాహోలో లేనిది ‘సలార్’లో చూపిస్తున్న ప్రభాస్!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాల్లో నటిస్తూ బిజీగా మారాడు. ఇప్పటికే కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ సినిమాలో నటిస్తున్న ప్రభాస్, ఈ సినిమా పూర్తిగాకముందే తన నెక్ట్స్ చిత్రాలను కూడా తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నాడు. అయితే సలార్ సినిమాపై ప్రభాస్ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Salaar: రాధేశ్యామ్, సాహోలో లేనిది ‘సలార్’లో చూపిస్తున్న ప్రభాస్!

Prabhas Looks In Salaar Makes Fans Happy

Salaar: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాల్లో నటిస్తూ బిజీగా మారాడు. ఇప్పటికే కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ సినిమాలో నటిస్తున్న ప్రభాస్, ఈ సినిమా పూర్తిగాకముందే తన నెక్ట్స్ చిత్రాలను కూడా తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే మరో డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ K సినిమాలో నటిస్తున్న ప్రభాస్, డైరెక్టర్ మారుతితో కూడా ఓ సినిమా చేస్తున్నాడు.

Salaar: ఆదిపురుష్ దెబ్బ ‘సలార్’కు కూడా తగలనుందా..?

అయితే సలార్ సినిమాపై ప్రభాస్ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. కాగా, ఈ సినిమా ప్రభాస్ లాస్ట్ రెండు సినిమాలను మైమరిపించడం ఖాయమని చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకులు కూడా భావిస్తున్నారు. దానికి ముఖ్య కారణం ఈ సినిమాలో ప్రభాస్ లుక్ అని వారు అంటున్నారు. రాధేశ్యామ్, సాహో సినిమాల్లో ప్రభాస్ లుక్ పరంగా మ్యాచో లుక్‌ను మిస్ అయిన ఆడియెన్స్‌కు సలార్ వర్కింగ్ స్టిల్స్‌లోనే ఆ లుక్ కనిపిస్తుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Salaar: సాలార్ మూవీలో ప్రభాస్ లుక్స్ సూపర్..

ఇక ప్రశాంత్ నీల్ వంటి మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్ ప్రభాస్ లాంటి గ్లోబల్ స్టార్‌ను ఎలా చూపిస్తే ప్రేక్షకులు నచ్చుతారో, సలార్ సినిమాలో ప్రభాస్‌ను అలాగే చూపిస్తున్నారు. గుబురైన గడ్డం, అదిరిపోయే ఫిజిక్ లుక్‌తో ప్రభాస్‌ను ఈ సినిమాలో మరో లెవెల్‌లో ప్రెజెంట్ చేస్తూ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేస్తున్నారు. ఇక ఈ సినిమాలో అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది.