Prabhu Deva: డైరెక్షన్‌కు గుడ్ బై చెప్పిన ప్రభుదేవా..!

డాన్సర్‌గా తన ప్రతిభతో ఇండియన్ మైకేల్ జాక్సన్‌గా పేరు తెచ్చుకున్న ప్రభుదేవా.. హీరోగానూ.. దర్శకుడిగానూ.. మల్టీ టాలెంట్‌తో తనేంటో నిరూపించుకున్నాడు.

Prabhu Deva: డైరెక్షన్‌కు గుడ్ బై చెప్పిన ప్రభుదేవా..!

Prabhudeva

Prabhu Deva: డాన్సర్‌గా తన ప్రతిభతో ఇండియన్ మైకేల్ జాక్సన్‌గా పేరు తెచ్చుకున్న ప్రభుదేవా.. హీరోగానూ.. దర్శకుడిగానూ.. మల్టీ టాలెంట్‌తో తనేంటో నిరూపించుకున్నాడు. ఇకపై ప్రభుదేవా తన దర్శకత్వానికి ఎండ్ కార్డ్ వెయ్యాలని నిర్ణయించుకున్నాడు. సినిమాల్లో నటించడం.. కొరియోగ్రఫీ మాత్రమే చెయ్యాలని దర్శకత్వం చేయకూడదని నిర్ణయించుకున్నాడు.

డైరెక్టర్‌‍గా ప్రభుదేవా రీసెంట్ ట్రాక్ రికార్డ్ చాలా బ్యాడ్‌‌గా ఉంది. సల్మాన్ ఖాన్ నటించిన రాధేను కూడా ప్రభుదేవానే తెరెకెక్కించారు. లేటెస్ట్‌గా డ్యాన్స్ కొరియోగ్రాఫర్‌గా మూడు కొత్త ప్రాజెక్ట్‌లపై సంతకం చేశారు ప్రభుదేవా. కొరియోగ్రాఫర్‌గా.. నటుడిగా మాత్రమే ఇకపై పరిశ్రమలో ఉండేందుకు ప్రభుదేవా నిర్ణయించుకున్నట్లుగా సన్నిహితులు చెబుతున్నారు.

ఈ క్రమంలోనే బాలీవుడ్‌కు బై బై చెప్పేసిన ప్రభుదేవా చైన్నై చేరుకున్నాడు. ఇకపై తెలుగు, తమిళ్, హిందీ సినిమాల్లో నటనకు, కొరియోగ్రఫీకి మాత్రమే టైమ్ కేటాయించాలని ఫిక్స్ అయ్యాడు. ప్రస్తుతం ప్రభుదేవా భగీరా(Bagheera) అనే సినిమాలో మెయిన్ రోల్‌ చేస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సినిమా తర్వాత కూడా కేవలం నటనకు, డాన్స్‌కి మాత్రమే తన సమయాన్ని కేటాయించనున్నారు ప్రభుదేవా.