Pragathi : ఆంటీ అంటే నేను కూడా ఊరుకోను.. నేను అందగత్తెనే.. జిమ్ చేసేది అందం కోసం కాదు..

తాజాగా ప్రగతి ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా పలు ఆసక్తికర విషయాలని తెలియచేసింది. ఈ ఇంటర్వ్యూలో ప్రగతి మాట్లాడుతూ.. ''నన్ను కొంతమంది ఆంటీ అంటే నాకు నచ్చదు, ఆంటీ బదులు అమ్మ అంటే ఓకే. ఆంటీ అనే పదం తప్పుగా అనిపిస్తుంది. కొంతమంది...........

Pragathi : ఆంటీ అంటే నేను కూడా ఊరుకోను.. నేను అందగత్తెనే.. జిమ్ చేసేది అందం కోసం కాదు..

Pragathi comments on her beauty and gym exercises

Pragathi :  చిన్న వయసులోనే సినీ పరిశ్రమకి వచ్చి హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టి చాలా త్వరగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి షిఫ్ట్ అయిపోయి అమ్మ, అత్త పాత్రలు చేస్తూ మెప్పిస్తుంది ప్రగతి. సీనియర్ ఆర్టిస్ట్ ప్రగతికి సోషల్ మీడియాలో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. తాను జిమ్ లో ఎక్సర్ సైజ్ లు చేస్తూ వీడియోలు, ఫొటోలు, తాను ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఇప్పటి హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గకుండా కష్టపడుతుంది ప్రగతి.

తాజాగా ప్రగతి ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా పలు ఆసక్తికర విషయాలని తెలియచేసింది. ఈ ఇంటర్వ్యూలో ప్రగతి మాట్లాడుతూ.. ”నన్ను కొంతమంది ఆంటీ అంటే నాకు నచ్చదు, ఆంటీ బదులు అమ్మ అంటే ఓకే. ఆంటీ అనే పదం తప్పుగా అనిపిస్తుంది. కొంతమంది శాడిస్టిక్ గా ఆంటీ అని పిలుస్తారు. చిన్న పిల్లలు, నా కొడుకు ఏజ్ ఉన్న వాళ్ళు ఆంటీ అంటే తప్పులేదు. కానీ వాళ్ళ కంటే పెద్దవాళ్ళు కూడా నన్ను ఆంటీ అంటే కోపం వస్తుంది, నేను ఊరుకోను” అని తెలిపింది.

Kantara : ఆ మ్యూజిక్ మాదే.. కాంతార సినిమా టీంకి లీగల్ నోటీసులు..

ఇక తన జిమ్, ఎక్సర్ సైజ్ ల గురించి మాట్లాడుతూ.. ”నేను జిమ్ చేసేది అందం కోసం కాదు, బలం కోసం. నేను అందగత్తెనే. నాకు అవకాశాలు బాగానే వస్తాయి. అందమైన హీరోయిన్ కి అమ్మ, అత్త పాత్ర చేయాలంటే కాస్త అందంగానే ఉండాలి” అని తెలిపింది.