ప్ర‌తి రోజు పండ‌గే.. ఫ‌స్ట్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్

  • Edited By: veegamteam , September 12, 2019 / 05:56 AM IST
ప్ర‌తి రోజు పండ‌గే.. ఫ‌స్ట్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్

సాయిధ‌ర‌మ్ తేజ్ ప్ర‌స్తుతం అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్స్‌పై నటిస్తున్న  సినిమా ‘ప్రతిరోజూ పండగే’. ఈ సినిమాకు మారుతి ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. స‌త్య‌రాజ్ కీల‌క పాత్ర‌లో కనిపించ‌నున్నారు. 

అయితే తాజాగా మూవీ ఫ‌స్ట్ లుక్ తో పాటు మోషన్ పోస్టర్ విడుద‌ల చేశారు. ఈ లుక్ లో స‌త్య‌రాజ్ జంప్ చేస్తుంటే తేజూ ప‌డిపోతావు అన్న‌ట్టుగా ఎక్స్‌ప్రెష‌న్ ఇచ్చాడు. ఇక ఈ సినిమాలో వీరిద్ద‌రు తండ్రి, కొడుకులుగా క‌నిపిస్తార‌ని టాక్. ఇటీవలే ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. డిసెంబ‌ర్‌లో  ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు.