Pushpa 2: ఎంత పెరిగినా ‘తగ్గేదే లే’ అంటోన్న మైత్రీ!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-ది రైజ్’ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక పుష్ప తొలి భాగం అందుకున్న సక్సెస్‌తో రెండో భాగాన్ని తెరకెక్కించేందుకు ఫుల్ జోష్ మీదున్నారు చిత్ర యూనిట్. తొలి భాగం కంటే రెట్టింపు బడ్జెట్‌ను ఇప్పటికే సినిమాకు కేటాయించింది మైత్రీ మూవీ మేకర్స్.

Pushpa 2: ఎంత పెరిగినా ‘తగ్గేదే లే’ అంటోన్న మైత్రీ!

Pushpa 2 Budget Goes Higher

Pushpa 2: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-ది రైజ్’ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసింది. మాస్ సినిమాను జనాల్లోకి సుకుమార్ తీసుకెళ్లిన తీరు అద్భుతంగా ఉండటంతో ఈ సినిమాకు ప్రేక్షకులు పట్టం కట్టారు. ఈ సినిమాకు కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది.

Pushpa 2: గ్లోబల్ మూవీ సీక్వెల్‌తో పుష్ప సీక్వెల్ బ్యాంగ్.. మామూలు స్కెచ్ కాదుగా!

ఇక పుష్ప తొలి భాగం అందుకున్న సక్సెస్‌తో రెండో భాగాన్ని తెరకెక్కించేందుకు ఫుల్ జోష్ మీదున్నారు చిత్ర యూనిట్. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు ముగించుకుని, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టేందుకు రెడీ అయ్యారు. కాగా, ఈసారి బన్నీ లుక్ పరంగా కొన్ని మార్పులు ఉంటాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ సీక్వెల్ సినిమాను ప్రేక్షకులకు నచ్చే విధంగా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ పక్కా ప్లానింగ్‌తో రంగంలోకి దిగిందట. ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాకుండా, ఎంత బడ్జెట్ అయినా కూడా ఓకే అంటున్నారు చిత్ర నిర్మాతలు.

Pushpa 2: ఆర్ఆర్ఆర్ ఎఫెక్ట్.. రియల్ టైగర్‌తో పుష్పరాజ్ ఫైట్..?

తొలి భాగం కంటే రెట్టింపు బడ్జెట్‌ను ఇప్పటికే సినిమాకు కేటాయించింది మైత్రీ మూవీ మేకర్స్. అయితే ఈ సీక్వెల్ సినిమా కోసం సుకుమార్ కొన్ని అద్భుతమైన సీక్వెన్స్‌లు భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. వాటికి అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్ అవుతుందని చిత్ర యూనిట్ చెబుతుండగా, ‘తగ్గేదే లే’ అంటే నిర్మాతలు దేనికైనా రెడీ అంటున్నారట. మొత్తానికి పుష్ప-2 సినిమా విషయంలో అటు నటీనటులు కానీ, టెక్నీషియన్స్ కానీ.. ఇటు నిర్మాతలు కానీ తగ్గేదే లే అంటూ దూసుకెళ్తుండటం నిజంగా విశేమని చెప్పాలి.