Radhe Shyam: కొవిడ్ రోగులకు విరాళంగా ప్రభాస్ సినిమా సెట్

కొన్ని సినిమాలు ప్రజలకు సందేశం ఇచ్చి మంచి చేస్తాయి. ఇంకొన్ని నేరుగా మంచిని చేస్తాయి. ఎలా అంటే.. ఇదిగో రాధే శ్యామ్ సినిమా సెట్ లాగే. రెబల్ స్టార్ ప్రభాస్.. పూజా హెగ్దేలు లీడ్ రోల్స్ లో నటిస్తున్న రాధే శ్యామ్ సినిమాకు యువీ సంస్థ యాబై పడకలతో సెట్ వేయించింది.

Radhe Shyam: కొవిడ్ రోగులకు విరాళంగా ప్రభాస్ సినిమా సెట్

Radhe Shyam

Radhe Shyam: కొన్ని సినిమాలు ప్రజలకు సందేశం ఇచ్చి మంచి చేస్తాయి. ఇంకొన్ని నేరుగా మంచిని చేస్తాయి. ఎలా అంటే.. ఇదిగో రాధే శ్యామ్ సినిమా సెట్ లాగే. రెబల్ స్టార్ ప్రభాస్.. పూజా హెగ్దేలు లీడ్ రోల్స్ లో నటిస్తున్న రాధే శ్యామ్ సినిమాకు యువీ సంస్థ యాబై పడకలతో సెట్ వేయించింది.

అందులో భాగంగా కొంత మేర షూటింగ్ పూర్తి చేశారు కూడా. అయినప్పటికీ ప్రస్తుతం కరోనా విలయ తాండవం చేస్తుండటంతో బెడ్లు లేక ప్రజలు పడుతున్న ఇబ్బంది చూసి.. యూవీ సంస్థ చలించింది. సెట్ లో ఉన్న టోటల్ ఎక్విప్ మెంట్ ను కిమ్ హాస్పిటల్ కు డొనేట్ చేసేసింది.

యాబై మంచాలతో పాటు వాటికి పరుపులు, ఆక్సిజన్ సిలిండర్లు, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ లాంటివన్నీ డొనేట్ చేసేశారు. మిగిలి ఉన్న షూటింగ్ కు ఏర్పాట్లు తర్వాత చేసుకుందామనే ఉద్దేశ్యంతో ఇలా చేశారు. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం ఇటలీలో షూట్ చేశారు.