‘రాధే శ్యామ్’ మ‌హా శివ‌రాత్రి విషెస్

రెబల్ స్టార్ ప్రభాస్, గార్జియస్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ లవ్లీ ఎంటర్‌టైనర్.. ‘రాధే శ్యామ్’. పాన్ ఇండియన్ సినిమాగా రానున్న ఈ సినమాపై అన్ని భాషలలో కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రభాస్, పూజా హెగ్డే ఫస్ట్‌లుక్ పోస్టర్లు, . మోషన్ పోస్టర్‌తో పాటు ప్రేమికుల రోజు సందర్భంగా విడుద‌ల చేసిన రొమాంటిక్ గ్లింప్స్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..

‘రాధే శ్యామ్’ మ‌హా శివ‌రాత్రి విషెస్

Radhe Shyam – Maha Shivratri: రెబల్ స్టార్ ప్రభాస్, గార్జియస్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ లవ్లీ ఎంటర్‌టైనర్.. ‘రాధే శ్యామ్’. పాన్ ఇండియన్ సినిమాగా రానున్న ఈ సినిమాపై అన్ని భాషలలో కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రభాస్, పూజా హెగ్డే ఫస్ట్‌లుక్ పోస్టర్లు, మోషన్ పోస్టర్‌తో పాటు ప్రేమికుల రోజు సందర్భంగా విడుద‌ల చేసిన రొమాంటిక్ గ్లింప్స్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..

నేను రోమియో టైపు కాదు.. ‘రాధే శ్యామ్’ గ్లింప్స్ చూశారా!

మ‌హా శివ‌రాత్రి సంద‌ర్భంగా డార్లింగ్ ఫ్యాన్స్‌ని స‌ర్‌ప్రైజ్ చేస్తూ ‘రాధే శ్యామ్’ నుంచి ఓ రొమాంటిక్ పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. పూర్తిగా మంచు బ్యాక్ డ్రాప్‌లో ప్ర‌భాస్, పూజాహెగ్డేలు క‌లిసి ఉన్న ఈ పోస్ట‌ర్ అభిమానుల అంచ‌నాల్ని మ‌రింత రెట్టింపు చేసేలా ఉంది. రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ‘రాధే శ్యామ్’ తో ఈసారి రొమాంటిక్ ట‌చ్‌తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు అనే విష‌యం మ‌రోసారి ఈ శివ‌రాత్రి స్పెష‌ల్ పోస్ట‌ర్ ద్వారా వెల్ల‌డైంది.

Radhe Shyam

రెబ‌ల్ స్టార్ డా.యూ.వి.కృష్ణంరాజు స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్ధ‌లు గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేష‌న్స్ భారీ బడ్జెట్‌తో ‘రాధే శ్యామ్’ సినిమాను అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. వంశీ, ప్ర‌మోద్, ప్ర‌సీదలు ఈ పాన్ ఇండియా సినిమాకు నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌ముఖ మ్యూజిక్ డైరెక్ట‌ర్ జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు, క‌న్న‌డ‌, త‌మిళ‌, మ‌ళ‌యాలీ వెర్ష‌న్స్‌కు సంగీతాన్ని అందిస్తున్నారు. హిందీ వెర్షన్‌కు మిథూన్, మనన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. జూలై 30న‌ ‘రాధే శ్యామ్’ భారీ రేంజ్‌లో విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.

Radhe Shyam