SSMB 29 : జంగిల్ బేస్డ్ అడ్వెంచర్.. వర్క్ స్టార్ట్ అయిందంటగా..

తండ్రి విజయేంద్ర ప్రసాద్‌తో కలిసి మహేష్ బాబు సినిమా స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేశారు రాజమౌళి..

SSMB 29 : జంగిల్ బేస్డ్ అడ్వెంచర్.. వర్క్ స్టార్ట్ అయిందంటగా..

Ssmb 29

SSMB 29: దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. జక్కన్న ప్ర‌స్తుతం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌ల‌తో తీసిన ‘రౌద్రం ర‌ణం రుధిరం’(RRR) రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఫైనల్‌గా మార్చి 18 లేదా ఏప్రిల్ 28 రెండు డేట్స్ అనుకుంటున్నారు.

Hyderabad Traffic Police : ‘అఖండ’ ను వాడేసిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. బాలయ్యకి థ్యాంక్స్!

మహేష్ ‘సర్కారు వారి పాట’ బ్యాలెన్స్ కంప్లీట్ చేసిన తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చెయ్యబోతున్నారు. ఆ తర్వాతే రాజమౌళి మూవీకి షిఫ్ట్ అవుతారు. మహేష్ నటించే 29వ సినిమా ఇది. ‘ఆర్ఆర్ఆర్’ పనులు పూర్తయిపోవడంతో జక్కన్న, మహేష్ బాబు సినిమా స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేసేశారు.

Mahesh-Namrata : ‘హ్యాపీ బర్త్‌డే NSG.. నువ్వే నా ఎనర్జీ’.. నమ్రతకి మహేష్ విషెస్..

జంగిల్ బ్యాక్ డ్రాప్‌లో హాలీవుడ్ రేంజ్ యాక్షన్ అడ్వంచర్ మూవీగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. రాజమౌళి తన తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్‌తో కలిసి కథా చర్చల్లో పాల్గొంటున్నారు. ఒకసారి స్క్రిప్ట్ లాక్ అయిపోయిన తర్వాత మిగతా ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి.

Allu Arjun : ఇద్దరిలో ఎవరితో బన్నీ పాన్ ఇండియా మూవీ?