Rakul Preet Singh : రకుల్‌కి తెలుగులో ఫేవరేట్ హీరో ఎవరో తెలుసా?

తాజాగా రకుల్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌ లో ఈ సెషన్ నిర్వహించింది. ఇందులో భాగంగా ఓ నెటిజన్ రకుల్‌ను టాలీవుడ్‌లో మీకు ఇష్టమైన నటుడు ఎవరు అని అడగడంతో.. ''అల్లు అర్జున్ తో ఉన్న ఫోటోని....

Rakul Preet Singh : రకుల్‌కి తెలుగులో ఫేవరేట్ హీరో ఎవరో తెలుసా?

Allu Arjun

 

Rakul Preet Singh :  ‘కెరటం’ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది రకుల్ ప్రీత్ సింగ్. ఆ తర్వాత తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తర్వాత బాలీవుడ్ లో ఛాన్సులు రావడంతో అక్కడికి షిఫ్ట్ అయిపోయింది. బాలీవుడ్ లో స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ప్రస్తుతం రకుల్ చేతిలో అరడజను పైగా బాలీవుడ్ సినిమాలు ఉన్నాయి. బాలీవుడ్ లో సినిమాలు ఉండటంతో తెలుగుని పూర్తిగా పక్కన పెట్టేసింది.

Samantha : బాలీవుడ్‌‌కి మకాం.. ముంబైలో ఇల్లు కొంటున్న సమంత..

ఇక సెలబ్రిటీలు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ అప్పుడప్పుడు తమ అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్‌ లో క్వశ్చన్స్ అడగమని అభిమానులు, నెటిజన్లు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు ఇస్తూ ఉంటారు. తాజాగా రకుల్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌ లో ఈ సెషన్ నిర్వహించింది. ఇందులో భాగంగా ఓ నెటిజన్ రకుల్‌ను టాలీవుడ్‌లో మీకు ఇష్టమైన నటుడు ఎవరు అని అడగడంతో.. అల్లు అర్జున్ తో ఉన్న ఫోటోని షేర్ చేస్తూ ఎప్పుడూ అల్లు అర్జునే అని పోస్ట్ చేసింది. దీంతో బన్నీ ఫ్యాన్స్ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఆ స్టోరీని స్క్రీన్ షాట్ తీసి షేర్ చేస్తున్నారు. ఇక రకుల్ గతంలో అల్లు అర్జున్ తో కలిసి ‘సరైనోడు’లో నటించిన సంగతి తెలిసిందే.